ఎన్టీయార్‌ ‘420’ అట..

550
Jr NTR next movie is titled as 420
Jr NTR next movie is titled as 420
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన దమ్ము చూపిస్తున్నాడు. ఎప్పుడైతే టెంపర్ సినిమాతో తిరిగి తన స్టార్ డమ్ ను అందుకున్నాడో.. అప్పటి నుంచి తన మునుపటి వైభవాన్ని చూపించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో నాన్నకు ప్రేమతో అంటూ అలరించిన ఎన్టీఆర్ ఇప్పుడు జనతా గ్యారేజ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా అసలైన సప్సెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఏ టైటిల్ తో వస్తాడో.. ఎవరితో సినిమా చేస్తాడో సినీ వర్గాలకు కూడా అంతుబట్టడం లేదు. ప్రస్తుతానికయితే కొన్ని టైటిల్స్, కొంతమంది డైరెక్టర్ల పేర్లు ఫిల్మ్ నగర్ లో విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయ్.
జనతాగ్యారేజ్ కలెక్షన్స్ సునామీ రేంజ్ లోనే.. ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలోనూ హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్స్ క్యూలో ఉన్నారు. వరసగా రెండు క్లాస్ మూవీస్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఈసారి పక్కాగా మాస్ స్టోరీ వైపు వెళ్లాలని ఆలోచిస్తున్నాడంట. అందుకు పూరీ అయితేనే కరెక్ట్ పర్సన్ అనే ఉద్దేశంలో కూడా ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ హిట్ కిక్కుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత వక్కంతం వంశీతో ఓ సినిమా చేయాల్సి ఉన్నా.. ప్రస్తుతానికి ఆ చిత్రాన్ని ప్రక్కన పెట్టాడు. మళ్లీ పూరీతో జతకట్టేందుకు రెడీ అయ్యాడు తారక్. మరోసారి ‘టెంపర్’ చూపించాలని డిసైడ్ అయినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్.
తారక్ కోసం ఓ డిఫరెంట్ కథని రెడీ చేసిన పూరీ.. దానికి ఓ వైరైటీ టైటిల్ ని కూడా పెట్టబోతున్నట్టు సమాచారమ్. ఎన్ టీఆర్ ని ‘420’ మార్చనున్నాడట పూరి. ఎన్టీఆర్ ‘420’ అంటూ సోషల్ మీడియాలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్ పక్కా అయితే, ఇదో మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్నట్టు కనిపిస్తోంది.
ఇజం మూవీ మేకింగ్ లో ఉన్న పూరీ.. ఇప్పటికే 420 అనే టైటిల్ బేస్డ్ గా స్టోరీ వినిపించేశాడంట. హీరోనే విలన్ క్యారెక్టర్ చేసినట్లు.. నెగెటివ్ షేడ్స్ బాగా ఉన్నాయంట. అయితే కథ దమ్ము కూడా అదే రేంజ్ లో ఉన్నట్లు టాక్. టెంపర్ లో కూడా నెగెటివ్ షేడ్స్ ఉంటాయి. అది బాగా వర్కవుట్ అయ్యింది. ఈ క్రమంలోనే అంత కంటే పవర్ ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ ను చూపించాలని పూరీ ప్లానింగ్ లో ఉన్నాడంట.

ఇజంలో కళ్యాణ్ రామ్ ఎవరూ ఊహించని విధంగా చూపించటంలో బాగా సక్సెస్ అయ్యాడు పూరీ. ట్రైలర్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇదే టెంపోను కంటిన్యూ చేస్తూ.. ఎన్టీఆర్ ను సరికొత్త అవతారంలో 420గా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడంట. మరి పూరీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.. లేదా అనేది చూడాలి. ఎన్టీఆర్ ‘420’ న్యూస్ ఎంతవరకు నిజమన్నది త్వరలోనే తేలనుంది.

- Advertisement -