ఈ వర్షాలకు వందేళ్ల రికార్డులు కొట్టుకుపోయాయి..

230
record rain
record rain
- Advertisement -

రాష్ట్రంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు రాష్ట్ర చరిత్రలో రికార్డుస్థాయిలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 39.54 సెంటీమీటర్ల గరిష్ఠ వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ అధికారుల గణాంకాల ప్రకారం.. సెప్టెంబరు 28, 1908న వరంగల్ జిల్లా హన్మకొండలో 30.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వేలాది చెరువులు నిండి అలుగుపోస్తుండగా, 71 చెరువులకు గండ్లు పడ్డాయి. భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వందల ఇండ్లు కూలిపోయాయి.

ARMOOR

ఆ తర్వాత జూలై 10, 1954న ఖమ్మంలో 30 సెం.మీ. వర్షపాతం రికార్డయింది. అక్టోబరు 6, 1983న నిజామాబాద్‌లో 35.5 సెం.మీ. వర్షపాతం నమోదై పాత రికార్డులను తుడిచేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో ఇదే అత్యధిక వర్షపాతం. కాగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి గత వందేళ్ల రికార్డులు కొట్టుకుపోయాయి.

మరో ఐదురోజులు..
రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాలపై ఉన్నట్టు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురువనున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

water in dams

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయించడానికి రోడ్లు భవనాలశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఉన్నతాధికారుల నుంచి మొదలుకుని క్షేత్రస్థాయి అధికారుల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అవసరమైన చర్యలు తీసుకొంటున్నారు.

rains

- Advertisement -