విజెవైఎస్‌ఆర్ ఆర్ట్స్ పతాకంపై వై. శేషిరెడ్డి సమర్పణలో తమిళ్‌లో సంచలన విజయం సాధించిన ‘తరకప్పు’ చిత్రంను తెలుగులో ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా వై. శేషిరెడ్డి మాట్లాడుతూ..’తమిళ్‌లో ఘనవిజయం సాధించిన ‘తరకప్పు’ చిత్రాన్ని తెలుగులో ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’ పేరుతో అనువదిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్ర హీరోలు సముద్రఖని, శక్తివేల్ పోటాపోటీగా నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఉత్కంఠ భరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఈ కథని దర్శకుడు రవి అద్భుతంగా తెరకెక్కించాడని శేషిరెడ్డి తెలిపాడు. అలాగే రెండు ప్రేమ జంటల చిలిపి విన్యాసాలు యువతను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెప్టెంబర్ రెండవ వారంలో ఆడియోని విడుదల చేసి..అక్టోబర్‌లో సినిమాని విడుదల చేయనున్నాము…అన్నారు.
ఈ చిత్రంలో శక్తివేల్ వాసు, సముద్రఖణి, వైశాలి, రియాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎమ్. రాజశేఖరరెడ్డి; ఫోటోగ్రఫీ: జోన్స్ ఆనంద్; సంగీతం: ఎఫ్.ఎస్. ఫైజల్; నిర్మాణం: విజెవైఎస్‌ఆర్ ఆర్ట్స్; దర్శకత్వం: రవి.