- Advertisement -
ఇరు తెలుగు రాష్ట్రాలను వరుణుడు ముంచెత్తబోతున్నాడు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు.
కోస్తా నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి ఆవరించి ఉందని చెప్పారు. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరోవైపు జీహెచ్ఎంసీలో సెలవులను అధికారులు రద్దు చేశారు. వర్షాల నేపథ్యంలో ఇవాళ, రేపు సిబ్బంది మొత్తం అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు.
- Advertisement -