ఇన్నోవేషన్‌ సెంటర్‌గా హైదరాబాద్‌

478
- Advertisement -

స్టార్టప్‌లకు చక్కని వేదికగా టీ-హబ్ ఇంక్యుబేటర్ ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. స్టార్టప్ కాన్ఫరెన్స్ ఆగస్ట్ ఫెస్ట్ నేడు నగరంలోని రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో ప్రారంభమైంది. ఆగస్ట్ ఫెస్ట్‌ను ప్రారంభించిన కేటీఆర్…ఇన్నోవేషన్ సెంటర్‌గా హైదరాబాద్ ఎదుగుతోందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స్టార్టప్ పెట్టాలనుకుంటున్నవారికి ఆగస్ట్ ఫెస్ట్ ఓ మంచి అవకాశమన్నారు.

ఐటీకి హైదరాబాద్‌లో చక్కని మౌలిక సదుపాయాలున్నాయి. ఇక్కడ స్టార్టప్‌కు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. స్టార్టప్‌తో వచ్చేవారు కొత్త ఐడియాస్‌తో రావాలి. ఇన్నోవేషన్ ఐడియాస్‌తో వచ్చేవారికి టీ-హబ్ మంచి వేదిక అవుతుందని మంత్రి పేర్కొన్నారు. టీ-హబ్ విజయవంతంగా పనిచేస్తోందని తెలిపిన మంత్రి ఇప్పటివరకు 30కి పైగా ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. ఐటీ సంస్థలు తమ సేవలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయని వెల్లడించారు.

- Advertisement -