ఆ తండ్రి నిజంగా ”శివగామే”

186
Ramakrishna, infant, Sattibabu,
Ramakrishna, infant, Sattibabu,
- Advertisement -

ఈ ఫొటోలు చూడగానే మొదట గుర్తొచ్చేది వాళ్ల కష్టం కాదు.. బాహుబలి సినిమా. శివగామి త్యాగం. అది సినిమా అయితే.. ఇది రియల్ స్టోరీ.

bahubali-father-

నాలుగు రోజుల నుంచి కుమార్తెకు తీవ్ర జ్వరం.. చికిత్స చేయించాలంటే కాలువ దాటాల్సిందే.. కానీ ఆ కాలువ ఇటీవలి వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎలాగైనా తన ఏడాది కుమార్తెను కాపాడుకునేందుకు ఆ కాలువను సైతం ఎదిరించడానికి సిద్ధపడ్డాడు ఓ తండ్రి. సరిగ్గా బాహుబలి సినిమాలో పసికందును చేతితో పైకెత్తి ప్రవాహానికి ఎదురునిలిచిన రమ్యకృష్ణను గుర్తుకు తెచ్చే ఈ ఘటన విశాఖ జిల్లా చింతపల్లి మండలం కుడుముసారిలో మంగళవారం చోటు చేసుకుంది. కుడుముసారి గ్రామానికి చెందిన పాంగి సత్తిబాబు ఏడాది కుమార్తెకు నాలుగు రోజులైనా జ్వరం తగ్గకపోగా తీవ్రమైంది.

bahubali-father-

చిన్నారిని చికిత్స కోసం తీసుకెళ్దామంటే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కుడుమసారి కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. బంధువులంతా వద్దన్నా కుమార్తెకు వైద్యం చేయించేందుకు కాలువ దాటడానికే సత్తిబాబు సిద్ధమయ్యాడు. తన బాబాయ్ సహాయం తీసుకున్నాడు.

bahubali-father

పీకల్లోతు నీటిలో చిన్నారిని రెండు చేతులతో ఎత్తుకుని.. వాగు దాటాడు. అతి కష్టంమీద.. చాలా జాగ్రత్తగా లోతుగెడ్డ ఆస్పత్రికి తీసుకొచ్చాడు చిన్నారిని. ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉంది. ఆస్పత్రి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు పాపను నెత్తిన పెట్టుకుని మరీ వెళ్లాడు. ఈ ఫొటోలను స్థానిక ఉపాధ్యాయుడు తీశారు. కుడుముసారి పంచాయతీకి రోడ్డు మార్గం లేదు. మాములు రోజుల్లో వాగులో నీళ్లు ఉండవు. భారీ వర్షాలు, వరదల సమయంలో మాత్రమే నీళ్లు వస్తాయి. ప్రస్తుత వర్షాలకు వాగు పొంగుతుండటంతో.. సత్తెబాబు ఇలా దాటాల్సి వచ్చింది.

- Advertisement -