ఆవు పేడతో అదిరే డ్రెస్..

174
Jalila Essaïdi's
Jalila Essaïdi's
- Advertisement -

ఆవు పేడతో ఇళ్ల ముందు కళ్లాపి చల్లుకోవడం మనకు తెలుసు.. పిడకలు కొట్టి, గోబర్‌గ్యాస్ ప్లాంట్ ద్వారా ఇంధనంగా వాడుకోవడమూ చూసుంటాం. మరి.. ఆవు పేడతో వస్త్రాన్ని తయారు చేయడం మీరెప్పుడైనా చూశారా? ఫొటోలో మోడల్ ధరించింది ఆవుపేడతో తయారైన దుస్తులే అంటే నమ్ముతారా? నమ్మి తీరాలి మరి. ఎందుకంటే నెదర్లాండ్స్‌కు చెందిన డిజైనర్ జలీలీ ఎసాడీ ఆల్రెడీ ఈ పనిచేసేసింది కాబట్టి.

 

ర్యాంప్‌పై వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ సుందరి ధరించిన డ్రెస్‌ను ఒకసారి పరికించి చూడండి. డ్రెస్ చాలా బాగుంది కదూ. అయితే ఆ డ్రెస్ వెనకున్న కథ తెలిస్తే మాత్రం కాస్తా షాక్ అవడం ఖాయం. ఎందుకంటే ఈ మోడల్ ధరించిన డ్రెస్ ఆవు పేడతో తయారైంది.

Jalila Essaïdi's

నెదర్లాండ్స్ డెయిరీ ఉత్పత్తులకు పెట్టింది పేరు. ఫలితంగా పాడిపశువుల వ్యర్థాలు ప్రతేడాది పెరిగిపోతున్నాయి. వ్యర్థాలు నీటిలో కలసిపోయి పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.
డెయిరీ ఉత్పత్తులకు పెట్టింది పేరైన నెదర్లాండ్స్ కు చెందిన డిజైనర్ జలీలీ ఎసాడీ పాడిపశువుల వ్యర్థాలతో దుస్తులు తయారు చేశారు. ప్రతి ఏడాది విపరీతంగా పెరిగిపోతున్న పాడిపశువుల వ్యర్థాలు నీటిలో కలసిపోయి పర్యావరణ ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు ఎసాడీ ప్రతిపాదిస్తున్న వినూత్న మార్గం ఈ పేడ దుస్తులు! పేడలోని సెల్యులోజ్ ను కొన్ని రసాయన ప్రక్రియలతో వేరుచేసి బయో పేపర్ – బయోప్లాస్టిక్ – బయో వస్త్రాలుగా మార్చవచ్చని ఎసాడీ నిరూపించింది. ఈ దుస్తులకు ‘మెస్టిక్’ అని నామకరణం చేశారు.. డచ్ భాషలో పేడను మెస్ట్ అంటారు.

Jalila Essaïdi's

ఆవు పేడను ఎరువుగా, ఇంధనంగా వాడటం సమస్యను సగమే పరిష్కరిస్తుందని, వస్త్రాలు తయారు చేస్తే సహజ వనరులను కాపాడుకోవచ్చని అంటున్నారు ఎసాడీ. ఈ ఏడాది జూన్‌లో ఎసాడీ ఎందోవెన్ మున్సిపాలిటీ భాగస్వామ్యంతో మెస్టిక్ వస్త్రాల ఫ్యాషన్ షో కూడా ఏర్పాటు చేశారు.

- Advertisement -