హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గల హయత్ హోటల్లో కార్ల విడిభాగాల తయారీ కంపెనీ జడ్ఎఫ్ గ్రూప్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ఐటీసీ ఏర్పాటుకు ముందుకొచ్చిన జడ్ఎఫ్ గ్రూప్ సమావేశానికి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్ లో ఇండియా టెక్నికల్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన జెఎఫ్ కంపెనీకి కేటీఆర్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామమని.. రాష్ట్రంలోని పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తే సదుపాయాలు కల్పిస్తామని కేటీఆర్ తెలిపారు. ఐటీ, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఆటోమొబైల్ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకురావాలి. హైదరాబాద్ ఐటీ హబ్ గా మారుతోందని.. రాష్ట్రంలోని అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఒప్పందం పత్రాలను ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌రంజన్, జడ్ఎఫ్ గ్రూప్ ఇండియా సీనియర్ మేనేజర్ మమతా చామర్తి మార్చుకున్నారు.
కాగా, జర్మనీకి చెందిన కార్ల విడిభాగాల తయారీ కంపెనీనికి సంబంధించిన ఈ కేంద్రంలో సాఫ్ట్వేర్, మెకానికల్ ఇంజినీరింగ్ కార్యకలాపాలను కొనసాగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. సంస్థకు అంతర్జాతీయంగా ఉన్న అన్ని డెవలప్మెంట్ టీమ్‌లకు ఈ సెంటర్ సేవలందించనుందని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు జెడ్ఎఫ్ పేర్కొంది. అంతేకాదు 2020కల్లా ఈ సెంటర్లో సెంటర్లో పనిచేసే ఇంజినీర్ల సంఖ్య 2,500కు చేరుకోవచ్చని తెలిపింది. ఇండియాలో సంస్థకు ఈ సెంటర్ ముఖ్యమైన పెట్టుబడి కానుంది.