చిరుగాలి సోకినా కందిపోయేంత అందం.. హన్సిక సొంతం. ఎనిమిదేళ్ల వయసులోనే కెమెరా ముందుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. దేశముదురు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తమిళనాట చిన్న ఖుష్బూగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది.
చిన్నవయసులోనే పలు చిత్రాలు, టీవీ సీరియళ్లలో నటించిన హన్సికను కథానాయికను చేసింది మాత్రం మన తెలుగు పరిశ్రమే. అల్లు అర్జున్ సరసన నటించిన దేశముదురు చిత్రం హన్సికకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. దేశముదురు తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది ఈ అమ్మడు.
ప్రముఖ గాయకుడు, బాలీవుడ్ నటుడు హిమేశ్ రేష్మియా జంటగా ఆప్ కా సురూర్లో నటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ పక్కన కంత్రి నటించి మరోసారి తెలుగులో మెరిసింది. ఆ తర్వాత కొంతకాలం హన్సిక తమిళనాట తన హవా కొనసాగించింది. 2011లో మాప్పిళ్లై చిత్రంలో ధనుష్‌కి జోడీగా నటించింది. మాతృ భాష సింధితో పాటు హిందీ, ఇంగ్లీష్‌లు తప్ప మరో భాష తెలీని హన్సిక తెలుగు, తమిళంలో మల్టీటాస్కింగ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో దేశముదురు హన్సికకు టర్నింగ్ పాయింట్ అయితే తమిళంతో విజయ్‌తో నటించిన వేలాయుధం సినిమా ఆమె లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ అయింది.
హన్సిక ఈ మధ్య తెలుగులో సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. రెండేళ్ల క్రితం వచ్చిన రవితేజ పవర్ తర్వాత.. ఇప్పటివరకూ టాలీవుడ్ సినిమాకే సైన్ చేయలేదీ పాతికేళ్ల సోయగం. మధ్యలో సైజ్ జీరోల మెరిసింది కానీ.. అది కేవలం కేమియో అపియరెన్స్ మాత్రమే. అయితే.. త్వరలోనే హీరోయిన్ గా పదేళ్ల కెరీర్ ని పూర్తి చేసుకుంటున్న ఈ భామ.. స్పెషల్ ఫోటోషూట్స్ తో అలరిస్తోంది.
2007 సంక్రాంతికి విడుదలైన దేశముదురుతో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా అప్ గ్రేడ్ అయిన ఈ బ్యూటీ.. మరో మూడు నెలల్లో పది వసంతాల పండుగ జరుపుకోనుంది. దశాబ్ద కాలంగా తన అందాలను ఇంకా కొత్తగా కనిపించేలా దాచుకోగలిగిందంటే.. హన్సిక నిజంగా దేశముదురే!