‘స్వామి రారా’ కాంబినేషన్లో ప్రొడక్షన్ నెం3

183
Abhishek Pictures Production no 3 Opening
Abhishek Pictures Production no 3 Opening
నిఖిల్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 3గా నిర్మిస్తున్న చిత్రం ఈరోజు సంస్థ కార్యాలయంలో యూనిట్ సభ్యుల మధ్య నిరాడంబరంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అభిషేక్ నామా క్లాప్ ఇవ్వగా, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, అభిషేక్ నామా తండ్రి నామా మధుసూదనరావు కెమేరా స్విచాన్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ – ”రివెంజ్ డ్రామా స్టోరీ ఇది. నిఖిల్ కొత్త క్యారెక్టర్లో కనిపిస్తాడు. రివెంజ్ డ్రామాలో లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. షూటింగ్ అంతా కాకినాడ నుంచి విశాఖ వరకూ ఉన్న సముద్రతీర ప్రాంతంలో జరుపుతాం” అన్నారు.
నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ – “నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘స్వామి రారా’ తెలుగులో క్రైమ్ కామెడీ సినిమాల్లో కొత్త ట్రెండ్ సృష్టించింది. ఇప్పుడీ సినిమా కూడా సరికొత్తగా ఉంటుంది. సుధీర్ వర్మ చాలా మంచి కథ చెప్పాడు. సెప్టెంబర్ 19న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. నిఖిల్ సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. రావు రమేష్ కీలక పాత్రలో కనిపిస్తారు. త్వరలో టైటిల్, ఇతర టెక్నీషియన్ల వివరాలు ప్రకటిస్తాం” అన్నారు.