సీఎన్‌బీసీ అవార్డు అందుకున్న కేటీఆర్‌

382

తెలంగాణ ప్రభుత్వం మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డును దక్కించుకుంది. సీయన్‌బీసీ టీవీ 18 ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్‌లో భాగంగా తెలంగాణను మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డుకు ఎంపిక చేశారు.ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ… మంత్రి కేటీఆర్‌కు అవార్డును అందజేశారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు ఈ అవార్డు నిదర్శనమని కేటీఆర్ తెలిపారు. కొత్త రాష్ట్రం తెలంగాణ అనతికాంలోనే అద్భుతాలను సృష్టించిందని.. మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్‌గా తెలంగాణను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రతి ఏటా సీఎన్‌బీసీ టీవీ-18 నిర్వహించే ‘ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్’లో భాగంగా వరుసగా రెండోసారి రాష్ట్రానికి ఈ అవార్డు లభించింది. అభివృద్ధిలోనే కాకుండా దేశ సమగ్రత, నిబద్ధతకు అనుగుణంగా వ్యాపార దృ క్పథం, మార్కెటింగ్ నైపుణ్యాలు ప్రదర్శించిన విజేతలకు 11 ఏళ్లుగా సీఎన్‌బీసీ గ్రూప్ ఈ అవార్డు అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన పారదర్శక విధానాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేసింది.