సిక్స్‌ ప్యాక్‌తో కళ్యాణ్ రామ్‌

159

పటాస్ సినిమాతో ఫాంలోకి వచ్చిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌తో ఇజం అనే మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ న్యూ లుక్ లో కనిపించనుండగా ఆయన సరసన అదితి ఆర్య కథానాయికగా నటిస్తోంది. గతంలో అల్లు అర్జున్, మహేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన పూరీ, తన సినిమాలలో ఈ హీరోల లుక్ లు పూర్తిగా మార్చేసాడు. ఇప్పుడు ఇజం మూవీలోను కళ్యాణ్ రామ్ ని సరికొత్తగా చూపించబోతున్నాడు పూరీ.

ism-nw-look

ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీతో డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్న కళ్యాణ్.. ఆ తరువాత చేయబోయే రెండు సినిమాలను ఫైనల్ చేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా పూరీ స్టైల్లో ఓ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్ గా కనిపించనున్నారు. జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతం అందిస్తున్నారు.

Kalyanram-six-pack

kalyan-ram