సింహాచలంలో ‘అశ్లీల నృత్యాలు’

208
- Advertisement -

అదో పుణ్యక్షేత్రం….ఎంతో మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. పండుగల సమయంలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది.ఇంతకీ ఆ పుణ్యక్షేత్రం ఏంటా అనుకుంటున్నారా….అదే ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ సమీపంలోని సింహాచలం. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎలాంటి అసభ్యత..అపశృతులు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా వినాయక చవితి పర్వదినాన అపచారం చోటు చేసుకుంది.

ఏకంగా రికార్డింగ్ డ్యాన్స్ లు పెట్టడం కలకలం సృష్టించింది. సింహాచలం ప్రధాన వీధియైన పోస్టాపీసు వీధుల్లో రికార్డింగ్ డ్యాన్స్ లు పెట్టారు. రాత్రి 12.30గంటల తరువాత ఈ డ్యాన్స్ లు నిర్వహించారు. మద్యం సేవించిన యువతులు అశ్లీల నృత్యాలు చేశారు. నిర్వాహకుల ఆనందాన్ని రెట్టింపుచేసేందుకు రెచ్చిపోయి చిందులేశారు. వినాయక చవితి సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించిన ఏమాత్రం పట్టించుకోలేదు.

పెట్రోలింగ్ చేస్తూ అక్కడకు వచ్చిన పోలీసులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో స్ధానికులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ఆలయ క్షేత్ర పవిత్రతను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇలాంటి వాటిని ప్రొత్సహించటంపై మండిపడుతున్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెల్లారి వరకు ఈ తతంగం సాగింది. స్ధానికుల నుంచి వ్యతిరేకత రావటంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.

- Advertisement -