ముసిముసినవ్వుల ముద్దుగుమ్మ సమంత సినిమాలలో ఏ రేంజ్ లో హీరోయిన్ గా ఆకట్టుకుందో అదే విధంగా తనకు ఉన్నదానిలో అనాధలకు సాయం చేయడంలోనూ ముందంజలో ఉంటుంది. సినిమా హీరోయిన్ గానే కాదు.. సమంత మంచి మనసున్న మనిషి అని అభిమానులు సగర్వంగా చెప్పుకొంటారు.. సమాజ సేవ చెయ్యడంలో సమంత ఎప్పుడూ ముందుంటుంది… ప్రత్యూష ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.. ఇప్పటికే చాలా మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించింది. సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్రవేసి నిరూపించుకుంది. తాజాగా మరోమారు తన గొప్ప మనసును చాటుకుంది సమంత. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న నిరుపేద చిన్నారి చాందినికి హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో సమంత శస్త్ర చికిత్స చేయించి ఆ చిన్నారికి ప్రాణం పోసింది.
ఐదేళ్ల చాముండేశ్వరి గంగా భవాని (చాందిని) అనే బాలిక రాజమండ్రి వద్ద జరిగిన యాక్సిడెంట్ లో తన ఎడమ కాలుని కోల్పోయింది. ఈ పాప కాలుకు శస్త్ర చికిత్స చేసి కృతిమ కాలుని అమర్చడానికి సమంత సాయం చేసింది. రెండు రోజుల క్రితం నగరంలో ఓ హాస్పటల్ లో చాందినికి శస్త్ర చికిత్స నిర్వహించారు.. సమంత ఆస్పత్రికి వెళ్ళి చాందినిని పరామర్శించింది.. ప్రత్యూష సేవా సంస్థకు సహకారం అందిస్తున్న ఆస్పత్రికి.. సర్జరీ చేసిన డాక్టర్ కు ప్రత్యేక ధన్యవాదలు తెలిపింది…కాగా సమంత చేస్తున్న సేవలకు.. అభిమానులు గర్వంతో జేజేలు కొడుతున్నారు.. పలువురు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు… చిన్నారి కాలుని తిరిగి ఇచ్చి .. చిరునవ్వుకి కారణం అయిన సమంత.. అందరి ప్రశంసలను పొడడంతో పాటు.. ఆశీర్వదాలను కూడా అందుకొంటోంది.
సమంత సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందే ఉంటుంది. 2012లోనే ‘ప్రత్యూష ఫౌండేషన్’ స్థాపించి ఎంతో మందికి సమంత చేయూతనందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మనసున్న అమ్మాయికి ‘హ్యాట్సాప్’ చెప్పకుండా ఎలా ఉండగలం.