శ్రీవారి సేవలో అంబానీ

156

తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి అభిషేకం సేవలో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, తనయుడు అనంత్‌ అంబానీ పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.