విడాకుల కోసం కొడుతున్నాడు…

387
Bollywood actress accuses husband of harassment
Bollywood actress accuses husband of harassment

ఈ మధ్య సినీ సెలబ్రిటీస్ తమ దాపత్య జీవితం విషయం ఫై పోలీస్ స్టేషన్ కు వెళ్లడం , కోర్ట్ లకు వెళ్లడం ఎక్కవయింది. తాజాగా బాలీవుడ్ భామ తన భర్త రోజు కొడుతున్నాడని కేసు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది..

మోడల్‌ నుంచి నటిగా మారిన ఆలిసా ఖాన్‌ ప్రముఖ బాలీవుడ్‌ హీరో ఇమ్రాన్‌ హష్మీ సరసన ‘ఐనా’ సినిమాలో నటించింది. ఆమె ఇటీవలే సినీ నిర్మాత లవ్‌ కపూర్‌ను పెళ్లాడింది. ఆమె భర్త తిట్టడమే కాకుండా కొడుతున్నాడట ! దాంతో నా భర్త నన్ను కొడుతున్నాడు అంటూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కింది. భర్తపై ఫిర్యాదు కూడా చేసింది. ప్రేమ పెళ్లి చేసుకొని ఏడాది కూడా పూర్తి కాలేదని, అప్పుడే తనను వేధించడం , విడాకులు ఇవ్వమనడం ఎంత వరకు న్యాయం అంటూ పోలీసుల దగ్గర కన్నీరు పెట్టుకుంది.

హరిద్వార్ వాసి అయిన లవ్‌ కపూర్‌ను పెళ్లాడేందుకు ఆమె మతం కూడా మార్చుకుంది. ఘజియాబాద్‌ లోని ఓ అద్దె నివాసంలో ఈ జంట నివసిస్తోంది. గత శుక్రవారం ఓ హోటల్‌లో మద్యం మత్తులో భర్త తనపై దాడి చేశాడని, ఆ తర్వాత తనను హోటల్‌లో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లిపోయాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొంది. విడాకులు ఇవ్వాలని భర్త తనను వేధిస్తున్నాడని, అందుకు తాను ఒప్పుకోకుండా తమ వైవాహిక బంధాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఆమె తెలిపింది.

ఈమె ఒక్కతే కాదు ఇటీవల రోజుల్లో చాలామంది సినీ ప్రముఖులు విడాకుల కోసం కోర్ట్ కు వెళ్లడం చేస్తున్నారు..పెళ్లి చేసుకోవడం , 4, 5 ఏళ్ళు పూర్తి కాగానే విడాకుల కోసం పరుగులు పెడుతున్నారు. ఇదో ఫ్యాషన్ అయిపొయింది. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకొని సంవత్సరం కూడా కాలేదు అప్పుడే విడాకుల కోసం భార్య ని కొడుతున్నాడట లవ్ కపూర్ . పేరులో లవ్ ఉంది కానీ ఆలీసా పట్ల లవ్ లేదట లవ్ కపూర్ కు.