లంబాడి పిల్లగా రెజీనా…

438
first-look-regina-krishna-vamsis-nakshatram
first-look-regina-krishna-vamsis-nakshatram

ఎస్‌ఎంఎస్ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చిన రెజీనా ఆ తరువాత పలు సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నా ఈ అమ్మడికి ఆఫక్లు కరువయ్యాయి. ట్యాలెంట్‌తో పాటు అందం అభినయం ఉన్న ఈ బ్యూటీకి అదృష్టం కూడా కలిసి రాలేదు. ఇప్పుడు ఆ కొరత తీరేటట్లుగా కనిపిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రంలో రెజీనా హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జోడీగా రెజీనా నటిస్తుండగా.. ఇప్పుడీ భామ లుక్ ని రివీల్ చేశాడు దర్శకుడు.

కృష్ణవంశీ షేర్ చేసిన ఫోటోలో.. లంబాడీ పిల్ల గెటప్ లో రెజీనా కనిపిస్తోంది. పక్కనే ఓ లంబాడి సాంప్రదాయ నృత్యం చేస్తున్న ఫోటో కూడా ఉందిలెండి. ఇక బిగ్ బీతో రెజీనా ఉన్న ఫోటోను కూడా యాడ్ చేశారు. ఈ లంబాడీ గెటప్ లో రెజీనా భలేగా సెట్ అయిపోయింది. క్రియేటివ్ డైరెక్టర్ కదా.. బాగా శ్రద్ధ తీసుకుని మరీ యాజిటీజ్ గా తయారు చేసేశాడు కృష్ణవంశీ. ‘ఈ నక్షత్రం బాలీవుడ్ లో కూడా మెరవబోతోంది. రెజీనా ఇంతటి భారీ ఆఫర్ తో బాలీవుడ్ లో లాంఛ్ కావడం సంతోషంగా ఉంది. అనీస్ బాజ్మీ తీస్తున్న ఆంఖే-2 మూవీలో లెజెండరీ యాక్టర్ బిగ్ బీ.. అనిల్ కపూర్ లతో యాక్ట్ చేయనుంది’ అని చెప్పాడు కృష్ణవంశీ.

సందీప్ కిషన్, రెజీనా ప్రధాన పాత్రలలో కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న మూవీపై అభిమానులలో భారీ అంచనాలున్నాయి. సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, తనీష్ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో సందడి చేయనుండడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. ఏదేమైన మంచి కసితో ఈ సినిమా చేస్తోన్న కృష్ణవంశీ మంచి హిట్ కొడతాడని అంటున్నారు. ఇందులోని నటీనటులకు కూడా మంచి గుర్తింపు వస్తోందని విశ్లేషకుల అంచనా.