రేషన్ తీసుకుంటున్న బాలీవుడ్‌ బామలు

358

పేదలకు చౌక ధరల్లో ఆహార పదార్థాలను అందించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థకు కొందరు కిలాడీలు వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఖజానాకు భారీ స్థాయిలో నష్టం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లా మీరాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాహెబ్‌గంజ్‌లో ఓ రేషన్ డీలర్ బాలీవుడ్ హీరోయిన్ల పేరుతో కార్డులు సంపాదించి రేషన్ సరుకులు పొందుతున్నాడు. ఆ హీరోయిన్లు ఎవరో కాదు.. దీపికా పదుకోనే, రాణీ ముఖర్జీ, జాక్వలీన్ ఫెర్నండెజ్‌, సోనాక్షి సిన్హా.

ration card

వీరు కొద్ది నెలల క్రితం నుండి రేషన్ షాప్‌లో సరుకులు తీసుకెళ్తున్నారని, వీరు ఇక్కడి గ్రామస్తులను వివాహం చేసుకున్నాడని ఆ రేషన్ డీలర్ పేర్కొన్నాడు. దీనిపై గ్రామస్తుడు రేషన్ డీలర్ పై అధికారులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన సబ్ డివిజినల్ మెజిస్ట్రెట్‌.. దీనికి సంబంధించింన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దీపికా పదుకోనే, రాణీ ముఖర్జీ, జాక్వలీన్ ఫెర్నండెజ్‌, సోనాక్షీ సిన్హాలకు భర్తలు కూడా ఉండడం విశేషం. జాక్వలీన్ ఫెర్నండెజ్‌ భర్త పేరు సాధు లాల్. దీపిక భర్త పేరు రాకేష్ చంద్‌. రాణీ ముఖర్జీ భర్త పేరు రామ్ స్వరూప్ కాగా.. సోనాక్షి రమేష్ చంద్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ఆ రికార్డుల్లో ఉంది. అంతేకాకుండా దీపికా.. జనరల్ కేటగిరిలో ఉండగా.. మిగతా ముగ్గురు హీరోయిన్లకు ఓబీసి కేటగిరిలో ఉన్నారు.