రియో ‘సాక్షి’గా తలెత్తుకునేలా చేశావ్‌…

450
celebs wish Sakshi Malik
celebs wish Sakshi Malik
- Advertisement -

రియో ఒలింపిక్స్ లో ఎట్టకేలకు భారత్ బోణీ కొట్టింది. మహిళల రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ పతకాల ఖాతాను తెరించింది. కర్జిస్తాన్ క్రీడాకారిణి టైనీ బెకోవాను ఓడించి.. కాంస్యం పతకాన్ని సొంతం చేసుకుంది. ఒలింపిక్స్ లో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్ గా రికార్డు సృష్టించింది. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి భారత్‌ పతక వేదన తీర్చిన రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ను దేశమంతాఆకాశానికెత్తేస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సాక్షిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

రియోలో నీ గెలుపుతో యావత్‌ భారతదేశం గర్వపడుతోంది సాక్షి అంటు క్రికెట్ లెజండ్ సచిన్ అన్నారు. కంగ్రాట్స్‌ సాక్షి. రెజ్లింగ్‌లో ఒలింపిక్‌ మెడల్‌ సాధించిన మొదటి భారతీయ యువతిగా సాక్షి నిలవడం దేశానికే గర్వకారణం అంటూ బాలీవుడ్ నటుడు ఆమిర్‌ ఖాన్ ట్విట్ చేశాడు‌. భారతీయ మహిళలు దేశం గర్వపడేలా చేస్తున్నారు. అందులోనూరెజ్లింగ్‌లో. సాక్షి.. మమ్మల్ని తలెత్తుకునేలా చేశావ్‌.. అంటూ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ కొనియాడారు.ఆడపిల్లలను పురిట్లో చంపకుండా ఉంటే.. ఆ ఆడపిల్ల ఎంత ఎత్తుకు ఎదుగుతుందో సాధించి చూపించింది సాక్షి మాలిక్‌ అంటూ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసలు కురిపించారు

తన అమాయకపు చిరునవ్వులో గెలుపు.. మా నవ్వులో గర్వం. సాక్షి భావితరాలకు స్పూర్తిగా నిలుస్తుంది అంటూ కరణ్‌ జోహార్‌ ట్విట్ చేశారు. సాక్షి.. భారత్‌ నిన్ను ఎంతో ప్రేమిస్తోంది.. నీ గెలుపును గర్వంతో పండుగ చేసుకుంటాం అంటూ అజయ్‌ దేవగణ్‌ వ్యాఖ్యానించారు. నీ వల్ల భారతీయ జెండా మరింత ఎత్తుకు ఎగురుతోంది. నీ ఘనతతో ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశావు. కంగ్రాట్స్‌ సాక్షి అన్నారు రితేశ్‌ దేశ్‌ముఖ్‌. కంగ్రాట్స్‌ సాక్షి. ఇలాగే మన్ముందు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అంటూ మేరీ కోం తెలిపింది.

- Advertisement -