రాహుల్ సభలకు జనం కరువు…

817
rahul zaheerabad meeting
- Advertisement -

తెలంగాణలో పూర్తిగా కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు మరి అధ్వాన్నంగా తయారవుతోంది. ఇప్పటికే నాయకులు లేక పూర్తిగా సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి రోజు ఏదో ఒక ఎదురుదెబ్బ తలుగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ చేతిలో ఘోరంగా చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తన ప్రాబల్యాన్ని చాటుకోవాలని తహతహలాడుతోంది.

ఇప్పటికే తెలంగాణలో పూర్తిగా జవసత్వాలు లేకుండా పోయిన పార్టీకి కొంత జీవం పోయడానికి కాంగ్రెస్ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. స్థానిక నాయకులతో పాటు జాతీయ నాయకులను సైతం రప్పించి తెలంగాణలో ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. అందులో భాగంగానే జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపాలని భావించిన కాంగ్రెస్ నాయకుల ఆశలు అడియాసలే అయ్యాయి. రాహుల్ గాంధీ సభ జనం లేక వెలవెలబోయింది.

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కేవలం 5 నుంచి 6వేల మంది ప్రజలు మాత్రమే వచ్చినట్లు కనిపిస్తుంది. సభకు వచ్చిన అతి కొద్ది మంది జనాల్లో చాలా మంది రాహుల్ గాంధీ ప్రసంగం ప్రారంభం కాకముందే అక్కడి నుండి జారుకున్నారు. దీంతో జహీరాబాద్ లో రాహుల్ గాంధీ సభ అట్టర్ ప్లాప్ అయింది. జహీరాబాద్ సభ కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయలోపం వల్లే అట్టర్ ప్లాప్ అయిందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించిన జనం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసలు పట్టించుకోని పరిస్థితులే కనబడుతున్నాయి.

- Advertisement -