యూవీ పెళ్లిలో..కోహ్లీ ధూం ధాం..

104
yuvi wedding

భారత స్ట్రార్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. తన ప్రియురాలు, బాలీవుడ్‌ నటి హజెల్‌ కీచ్‌ను యూవీ బుధవారం పెళ్లి చేసుకోనున్నాడు. పెళ్లికి ముందు మంగళవారం చండీగఢ్‌లోని లలిత హోటల్‌లో యూవీ సంగీత్‌ వేడుక అట్టహాసంగా జరిగింది. సినీ, క్రికెట్‌ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై తెగ సందడి చేశారు. అయితే ఈ వేడుకలో యూవీ డ్యాన్స్‌ స్పెషల్‌ హైలెట్‌గా నిలిచింది. సంగీత్‌ వేడుకలో భాంగ్రా స్టెప్పులు వేస్తూ యూవీ అదరగొట్టాడు.

సంగీత్ కార్యక్రమంలో యూవీతో పాటు భారత్‌ క్రికెట్ జట్టు సభ్యులు కూడా చిందేశారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తనదైన స్పెప్పులతో రెచ్చిపోయాడు. యూవీ, విరాట్ చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

యూవీ పెళ్లి రెండుసార్లు జరగనుంది. బుధవారం చండీగఢ్‌లో సిక్కు సంప్రదాయాల ప్రకారం గురుద్వారలో యూవీ పెళ్లి చేసుకోనుండగా, శుక్రవారం (డిసెంబర్‌ 2న) హిందూ సంప్రదాయాల ప్రకారం గోవాలో వివాహం చేసుకోనున్నారు.

https://twitter.com/ViratFanTeam/status/803673040773070848