14 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత రాఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ఫ్రెంచ్‌కు చెందిన 22 ఏళ్ల లూకాస్ పౌలీ.. నాదెల్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఐదో సెట్ టైబ్రేక్‌లో పౌలీ 8-6 పాయింట్ల తేడాతో నాదెల్‌ను ఓడించాడు. 22ఏళ్ల ఈ ఫ్రెంచ్ యువ సంచలనం 6-1, 2-6, 6-4, 3-6, 7-6(8-6) పాయింట్ల తేడాతో నాలుగు గంటల పోరాటంలో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. పౌలీ కెరీర్‌లో ఇదే అతి పెద్ద విజయం.
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. దిగ్గజం లియాండర్ పేస్ పోరాటం ముగియగా… మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా.. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న జోడీలు ముందంజ వేశారు.
రెండో రౌండ్‌లో పేస్-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 6-7 (1/7), 6-3, 11-13తో ‘సూపర్ టైబ్రేక్’లో కోకో వాండెవాగె-రాజీవ్ రామ్ (అమెరికా) జంట చేతిలో ఓడిపోరుుంది. డిఫెండింగ్ చాంపియన్‌స అరుున పేస్-హింగిస్ జంట సూపర్ టైబ్రేక్‌లో ఒకదశలో 8-4తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ… ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకుంది.
మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో సానియా మీర్జా-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట 6-2, 7-6 (7/5)తో విక్టోరియా గొలుబిక్ (స్విట్జర్లాండ్)-నికోల్ మెలిచర్ (అమెరికా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో బోపన్న-గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా) జంట 5-7, 6-3, 10-7తో ‘సూపర్ టైబ్రేక్’లో లుకాస్ కుబోట్ (పోలాండ్)-ఆండ్రియా హలవకోవా (చెక్ రిపబ్లిక్) ద్వయంపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మాత్రం సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సానియా-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట 3-6, 4-6తో బార్బరా క్రెజిసికోవా (చెక్ రిపబ్లిక్)-మారిన్ ద్రగాంజా (క్రొయేషియా) జోడీ చేతిలో ఓడిపోరుుంది.