యూఎస్‌ ఓపెన్‌లో భారత్‌ శుభారంభం

453

యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో భారత టెన్సిస్‌ ఆటగాళ్లు సానియా మీర్జా, లియాండర్‌ పేస్‌, రోహన్‌ బోపన్నలు శుభారంభం చేశారు. తొలిరౌండ్‌ మహిళల, పురుషుల, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో వీరు తమ పార్ట్‌నర్స్‌తో కలిసి విజయం సాధించారు. మహిళల డబుల్స్లో సానియా మీర్జా-బార్బోరా స్టికోవా( చెక్ రిపబ్లిక్) జోడి గెలుపొందింది. 6-3, 6-2 వరుస సెట్లతో నెగ్గిన సానియా జోడీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మిక్స్డ్ డబుల్స్లో లియాండర్ పేస్- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) ద్వయం తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించగా, పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న-ఫ్రెడిక్ నీల్సన్(డెన్మార్) జంట విజయం సాధించింది.

us open

మిక్స్డ్ డబుల్స్లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన పేస్-హింగిస్ల ద్వయం 6-3, 6-2 తేడాతో సాచియా వికెరీ(అమెరికా)-తైఫో(ఫ్రాన్స్)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. 51 నిమిషాల పాటు జరిగిన పోరులో పేస్ హింగిస్లు వరుస సెట్లను కైవసం చేసుకున్నారు. ఇక పురుషుల డబుల్స్లో బోపన్న- నీల్సన్ జంట 6-3, 6-7(3), 6-3 తేడాతో పదహారో సీడ్ రాడెక్ స్టెపనాక్(చెక్ రిపబ్లిక్)- నెనాడ్ జిమోంజిక్(సెర్బియా)పై విజయం సాధించి రెండో రౌండ్లోకి చేరింది.

serena

టెన్నిస్‌ ఓపెన్‌లో అత్యధిక సింగిల్స్‌ టైటిళ్లు గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాలని తహతహలాడుతున్న మహిళల ప్రపంచ నెంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా) ఆ దిశగా ముందంజ వేసింది. యుస్‌ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. పదునైన సర్వీసులతో చెలరేగిన ఆమె తొలి రౌండ్లో 6-3, 6-3తో ఏక్తరినా మకరోవా (రష్యా)పై అలవోకగా గెలిచింది. సెరెనా 12 ఏస్‌లు, 27 విన్నర్లు కొట్టింది. సెరెనా ఇక్కడ టైటిల్‌ సాధిస్తే ఓపెన్‌ శకం రికార్డు (22 టైటిళ్లు)ను బద్దలు కొడుతుంది. ఈ రికార్డును ఆమె ప్రస్తుతం స్టెఫీగ్రాఫ్‌తో కలిసి పంచుకుంటోంది. ఆల్‌టైమ్‌ రికార్డు మార్గరెట్‌ కోర్ట్‌ (24 టైటిళ్లు) పేరిట ఉంది.