టీవీ మీడియా ను ఆధారంగా చేసుకొని కొంతమంది యాంకర్ లు హీరోయిన్ అవకాశాలను మరియు సినిమా అవకాశాలను కొట్టేస్తున్నారు. ఆ కోవకే చెందిన అనసూయ , రష్మీ మరియు నీహారికా లను చూసాము . ఇప్పుడు మరొక అమ్మడు ఇదే తరహాలో ప్రయత్నాలు మొదలు పెడుతుంది. మంచి హాట్ లుక్స్ తోను మరియు తన మాటల గారడీలతోను పాపులర్ అవుతున్న యాంకర్ శ్యామల.
తూర్పుగోదావరి కాకినాడకు చెందిన శ్యామల స్ర్కీన్‌పై యాంకర్ శ్యామలగా పేరు తెచ్చుకుంది. బుల్లితెరకు పరిచయమైన సమయంలో సీరియల్ యాక్టర్‌గా నటనలో ఓనమాలు దిద్దుతూ తన పార్ఫామెన్స్‌తో వెండితెరపై కూడా అవకాశాలు కొట్టేస్తుంది.అందమైన యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్దగా పరిచయం అక్కరలేదు.
లుక్స్ తో కూడా ఆకట్టుకోవడం ఈమె స్పెషాలిటీ. మరోవైపు పలు సినిమాల ఆడియో ఫంక్షన్స్ ను కూడా హోస్ట్ చేస్తూ.. కుర్రాళ్లు బాగా నోటెడ్ అయిపోయింది ఈ భామ. ప్రస్తుతం బుల్లితెరపై తన కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో ఉండడంతో.. ఆ నెక్ట్స్ స్టెప్ కి వెళ్లేందుకు బాగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
క్రేజ్ ఉండగానే కెరీర్ ని దిద్దుకోవాలనే ఆలోచన చేయడం ఇప్పుడే కాదు ఎప్పుడైనా జరిగేదే.. ఇప్పుడూ జరుగుతున్నదే. ఇప్పటికే పలు భారీ చిత్రాల ఆడియో ఫంక్షన్స్ లో కూడా సందడి చేయడంతో.. సినీ జనాలకు బాగానే నోటెడ్ అయిపోయింది. ఇదే ఊపులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేయాలన్నది అమ్మడి ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే అనసూయ.. ఝాన్సీ లాంటి యాంకర్లు చూపిన బాటలో నడవాలని భావిస్తోందట శ్యామల.
ఇప్పుడు ఈ అమ్మడు ఇదే పాపులారిటీ తో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అనసూయా మరియు జాన్సీ లాగా తాను కూడా సినిమా లలో రాణించగలనని సంకేతాలు ఇస్తున్నట్టు సమాచారం. మరి హీరోయిన్ అవకాశాలు దక్కనప్పటికీ మంచి పాత్రలకు మిగతావారి తో దీటిగా నటించగలదని కొన్ని వర్గాలు చెప్పుకుంటున్నారు. మరి ఈ అమ్మడు విజయావకాశాలు కాలమే నిర్ణయించాలి.