మోడీ అద్దిన శిల్పం..!

361

ప్రపంచ ప్రసిద్ధి చెందిన మే డమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మైనపు బొమ్మ కొలువు తీరిన సంగతి తెలిసిందే. ప్రజలకు నమస్కరిస్తున్నట్టు ఉండే నరేంద్ర మోడీ మైనపు విగ్రహాన్ని మ్యూజియంలో ఆవిష్కరించారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు ప్రపంచవ్యాప్తంగా 20 నగరాల్లో బ్రాంచ్ మ్యూజియమ్స్ ఉన్న విషయం తెల్సిందే.మోడీ ఎప్పుడూ కనిపించే క్రీమ్ కలర్ కుర్తాలో, దానిపై జాకెట్ ధరించి నమస్కారం చెబుతూ ఉండేలా ఈ వ్యాక్స్ స్టాచ్యూ ను డిజైన్ చేశారు మేడమ్ టుస్సాడ్స్ కు చెందిన ఆర్టిస్టులు. అయితే, మ్యూజియంలో ఆవిష్కరించే ముందు బొమ్మను మోడీకి చూపించారు. అయితే, ఈ సందర్భంగా మోడీ తన బొమ్మను దిద్దుతున్నట్లు ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే నెట్టింట్లో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగిఉన్న సంగతి తెలిసిందే.

Modi

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, నెల్సన్ మండేలా,భారత్ నుంచి జాతిపిత మహాత్మాగాంధీ, ఇందిరా గాంధీ,అమితాబ్, హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్,కరీనా కపూర్, మాధురీ దీక్షిత్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాలు ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరిన విషయం తెల్సిందే.

PM Modi