ముంబై బయల్దేరిన కేసీఆర్

176

రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే చారిత్రక ఒప్పందం కోసం సీఎం కేసీఆర్ మహారాష్ట్ర బయల్దేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ముంబై పయనమయ్యారు. మధ్యాహ్నం 12 గంటల10 నిమిషాలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం… అక్కడి నుంచి ఒంటి గంటకు రాజ్ భవన్ కు వెళతారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు.

మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు రాజ్ భవన్ నుంచి బయల్దేరి 3 గంటలకు సహ్యాద్రి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. అక్కడ జరిగే తెలంగాణ, మహారాష్ట్ర ఇంటర్ స్టేట్ బోర్డు సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు గెస్ట్ హౌస్ నుంచి బయల్దేరి 5 గంటల 15 నిమిషాలకు తిరిగి రాజ్ భవన్ చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు.

మహాతో చారిత్రక ఒప్పందం అనంతరం రేపు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున రైతులను తరలించి…సీఎం వెల్ కమ్ చెప్పేందుకు నేతలు సిద్ధమవుతున్నారు.