‘మిస్టర్‌ కార్తీక్‌’ సాంగ్స్

470
Mr Kathik songs Release
Mr Kathik songs Release

ఓం శివగంగ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై ధనుష్‌, రీచా గంగోపాధ్యాయ హీరో హీరోయిన్లుగా ‘7/జి బృందావన కాలనీ’ ఫేమ్‌ శ్రీ రాఘవ (సెల్వరాఘవన్‌) దర్శకత్వంలో రూపొందిన ‘మయక్కం ఎన్నా’ చిత్రాన్ని తెలుగులో ‘మిస్టర్‌ కార్తీక్‌’ పేరుతో నిర్మాతలు కె. బాబురావు, కె. మల్లిఖార్జున్‌లు అనువధించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను సముద్ర, రాజ్‌ కందుకూరిలు ఆవిష్కరించారు. ఆడియో సీడీని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌ ఆవిష్కరించి మరో నిర్మాత ఆర్‌.కె. గౌడ్‌కు అందచేశారు. శివరంజని మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఈ కార్యక్రమంలో జబర్ధస్త్‌ ఫణి కామెడీని పండించి ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..తమిళంలో మంచి విజయం సాధించిన ఈ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం, తెలుగులోనూ మంచి సక్సెస్‌ని సాధిస్తుంది. మేము నిర్మాతలుగా మారడానికి కారణం సి. కళ్యాణ్‌ గారు. ఆయన ప్రోత్సాహంతోనే ఈ చిత్రాన్ని మేము తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాము. మా ఈ ప్రయత్నంను ఆశీర్వదించడానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. డైరెక్టర్‌ సెల్వరాఘవన్‌ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ధనుష్‌ అభినయం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము..అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు నగేష్‌ నారదాసి, భూషణ్‌, మాటల రచయిత వెంకట్‌ మల్లూరి తదితరులు పాల్గొని..చిత్రం విజయం సాధించాలని కోరుకున్నారు.

ధనుష్‌, రీచా గంగోపాధ్యాయ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: జి.వి. ప్రకాష్‌, రైటర్‌: శశాంక్‌ వెన్నెలకంటి; మాటలు: వెంకట్‌ మల్లూరి, ప్రొడ్యూసర్స్‌: కె. బాబురావు, కె. మల్లిఖార్జున్‌; కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీరాఘవ.