మాజీ లవర్‌కు శుభాకాంక్షలు తెలిపిన కరీనా

225

అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న బాలీవుడ్ జీరో సైజ్ బ్యూటీ కరీనా కపూర్‌ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ విష‌యాన్ని కరీనా భర్త సైఫ్‌ అలీ ఖాన్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇక ఒకప్పటి షాహిద్ గాళ్ ఫ్రెండ్ కరీనా కపూర్ షాహిద్ కపూర్ కి శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం.

బాలీవుడ్ యువ హీరో షాహిద్ కపూర్ ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. అతని భార్య మీరా రాజ్పుత్ శుక్రవారం పండంటి పాపకు జన్మనిచ్చింది. బుజ్జాయి రాకతో షాహిద్ సంతోషంలో మునిగిపోయాడు. తొలిసారి తల్లిదండ్రులైన షాహిద్ దంపతులకు.. సన్నిహితులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.షాహిద్ తండ్రయ్యారన్న విషయం తెలిసిన వెంటనే షాహిద్కు అభినందనలు తెలుపుతూ కరీనా మెసేజ్ పంపించారట. ఒకప్పటి విఫల ప్రేమికులు.. వివాహానంతరం స్నేహితులుగా మారారు.

కాగా మరికొన్ని నెలలలో కరీనా కూడా తమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. పెళ్లి చేసుకొని, పిల్లల్ని కన్నంత మాత్రానా తాను సినిమాలకు దూరం కాబోనని కరీనా చెప్పిన విషయం తెలిసిందే. ‘‘నేను అందరిలాగే సాధారణ మహిళలా నా పని నేను చేసుకుంటాను. అందులో ఏం తప్పులేదు కదా! నా పనిని ఇష్టపడతా. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నటిని అవ్వాలనుకున్నా. అందుకే నేను 80ఏళ్లు వచ్చే వరకు నటిస్తూనే ఉంటా’’ అని కరీనా స్పష్టం చేసింది.