మళ్లీ తల్లికాబోతున్న శ్రీదేవి

213
sridevi-star-salman-khans-next
sridevi-star-salman-khans-next

అలనాటి అందాల నటి, బాలీవుడ్ నటి శ్రీదేవి చాలాకాలం తర్వాత ఇంగ్లిష్ వింగ్లిష్ మూవీతో మళ్లీ తెరపై తళుక్కుమన్న సంగతి తెలిసిందే. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తర్వాత శ్రీదేవి మళ్లీ బిజీగా మారిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. అయితే ఈ సినిమా బాలీవుడ్‌ను తప్ప జనాలను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమె రీ ఎంట్రీ అంతగా వర్కవుట్ కాలేదు.

ఆ తర్వాత కోలీవుడ్‌లో స్టార్ హీరో విజయ్ నటించిన పులి సినిమాలో రాజమాతగా నటించింది. అయితే ఈ సినిమా జనాలను పెద్దగా ఆకట్టుకోకపోయింది. సినిమా డిజాస్టర్ అనిపించుకోవడంతోపాటు రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతను శ్రీదేవి ఇబ్బంది పెట్టిందనే ప్రచారం ఆమెకు కొత్త ఆఫర్లు రాకుండా చేశాయి. రీఎంట్రీలో ఆమె మ్యాజిక్ పనిచేయకపోవడంతో శ్రీదేవికి ఆఫర్లు ఇచ్చేందుకు దక్షిణాదిలో ఆమెకు ఆఫర్లు ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు ముందుకు రావడం లేదు.

అయితే ఇప్పుడు మళ్లీ తల్లీ కొడుకుల సెంటిమెంట్‌తో వస్తోన్న ఓ కథతో రీ ఎంట్రీ ఇవ్వబోతోందట. అయితే హీరోయిన్‌గా కాదు…హీరో తల్లిగా ఆమె నటించబోతోందట. బాలీవుడ్‌ కండల వీరుడు ‘సల్మాన్‌ఖాన్‌’ తల్లిగా ‘శ్రీదేవి’ నటించబోతోంది. రీసెంట్‌గా దర్శక నిర్మాత ఒకరు తల్లీ కొడుకు సెంటిమెంట్‌తో సిద్ధం చేసిన కథను సల్లూభాయ్‌కి వివరించాడు. ఆయన సై అనడంతో తల్లి పాత్రకు శ్రీదేవిని తీసుకోవాలని నిర్ణయించారట. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు శ్రీదేవిని కలవకపోయినా ‘సుల్తాన్’ కోరితే ‘అతిలోకసుందరి’ కాదంటుందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆమెకు ఎంతోకొంత ప్లస్ అయ్యే చాన్స్ ఉంటుందని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.