మళ్లీ ఐటెంగా తమన్నా…

505
Tamanna item song in Jaguar Movie
Tamanna item song in Jaguar Movie

అగ్ర కథానాయికల ఐటెంసాంగ్స్ అంటే ప్రేక్షకులు ఎక్కువ క్రేజ్‌ను కనబరుస్తారు. సినిమాకు ఆ పాట అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

Tamanna special song in Nikhil Kumar's Jaguar

స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగుల్లో నటించడమనే ట్రెండ్ బాలీవుడ్‌లో ఎప్పట్నుంచో ఉంది. తెలుగులో ఇటీవల ఈ ట్రెండ్‌ను పాపులర్ చేసిన స్టార్ హీరోయిన్లలో తమన్నా ఒకరు. ‘నా ఇంటి పేరు సిల్కూ.. నా ఒంటి పేరు మిల్కూ’ అంటూ ‘అల్లుడు శీను’లో కొత్త హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ప్రత్యేక పాట చేయడం అప్పట్లో హాట్ టాపిక్. తర్వాత అదే హీరోతో ‘స్పీడున్నోడు’లోనూ స్పెషల్ సాంగ్ చేశారు. ఆ రెండు పాటలూ హిట్టే.

Tamanna item song in Jaguar Movie

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తెలుగులో ప్రత్యేక పాట చేయడానికి తమన్నా రెడీ అయ్యారు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘జాగ్వార్’. చన్నాంబిక ఫిలింస్ పతాకంపై శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్నారు. ఎ.మహదేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్ చేయనున్నారు.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నారు పెద్దలు. అందుకే ఇప్పుడు బాగా పర్సులోకి తోసేస్తోంది మిల్కీ బ్యూటి తమన్నా. అయితే ఇది ఏ రేంజులో అంటే.. ఇతర స్టార్ హీరోయిన్లు ఎవ్వరూ కనీసం కాంపిటీషన్ కూడా రాలేనంత ఈజీగా అమ్మడు కుమ్మేస్తోంది.

Tamanna Special Song In Jaguar Movie

ఇటీవల, శృతి హాసన్ ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ లో ఐటెం సాంగ్ చేయనుందని పుకార్లు ఉన్నాయి. తాజా వార్తల ప్రకారం, తమన్నా ప్రత్యేక మైన సెట్లో తెరకెక్కించనున్న స్పెషల్ సాంగ్ కోసం ఖరారు అయిందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ పాట సినిమాకు హైలైట్ అవనుందని తెలుస్తోంది.ఈ పాటలో తమన్నా గ్లామర్‌తో ఆకట్టుకుంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్ర ఆడియో వేడుకను ఈ నెల 18న హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నామని, దసరా కానుకగా చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు.

Tamanna Special Song In Jaguar Movie

ఇప్పటివరకు కెరియర్ లో రెండుసార్లు ఐటెం సాంగులు చేసింది మిల్కీ బ్యూటి. అవి రెండూ కూడా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తోనే చేసింది. ఇప్పుడు తన మూడో ఐటెంను ఈ కొత్త కుర్రాడితో చేస్తోందనమాట.