మరో 100 థియేటర్లలో ‘చుట్టాలబ్బాయి’

517

వీరభద్రం దర్శకత్వంలో ఆది హీరోగా సాయి కుమార్ ముఖ్య పాత్రలో నమిత ప్రమోద్ హీరోయిన్ గా తెరకెక్కిన  ‘చుట్టాలబ్బాయి’ 350 థియేటర్లలో ఆగష్టు 19 న రిలీజ్ అయింది. మిక్స్ డ్  రివ్యూస్ తో మొదలైనా, మొదటి మూడు రోజుల్లోనే 6 కోట్ల 30 లక్షలు కలెక్ట్ చేసి హీరో ఆది కెరీర్ లో నే హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది.

శుక్రవారం 350 థియేటర్లలో రిలీజ్ అయిన ‘చుట్టాలబ్బాయి’  బాక్స్ ఆఫీస్ దగ్గిర మంచి కలెక్షన్స్ తో సోమవారానికి మరో 100 థియేటర్లను పెంచుకుని 450 థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గిర రెస్పాన్స్ చూసి నైజాం ఏరియాలో 30 థియేటర్లు పెంచినా ప్రతి సెంటర్ లోను హౌస్ ఫుల్స్ తో దూసుకుపోతున్నట్టు భాగ్యశ్రీ ఫిలిమ్స్ రాకేష్ చెప్పారు. ‘చుట్టాలబ్బాయి’ ఆది కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి హీరో ఆది, డైరెక్టర్ వీరభద్రం కి కమ్ బ్యాక్ ఫిలిం అయింది. ‘చుట్టాలబ్బాయి’ ని ఐశ్వర్య లక్ష్మి మూవీస్ , ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై  వెంకట్ తలారి , రామ్ తాళ్లూరి  నిర్మించారు.