మరో సంచలన బయోపిక్ ను ప్రకటించిన వర్మ

282
Rgv Next movie Sasikala

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటివలే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సినిమాను ప్రారంభించిన నుంచి విడుదల వరకూ ఎప్పుడూ ఎదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉన్నాడు దర్శకుడు వర్మ. ఈ చిత్రం రిలీజ్ విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాల్లో చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రానికిగానూ వర్మకి మంచి ప్రశంసలే దక్కాయి.

ఏపీలో ఎన్నికల తర్వాత ఈసినిమాను విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై తాను సుప్రింకోర్టులో ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు దర్శకుడు వర్మ. ఈసినిమా తర్వాత వర్మ ఎవరి బయోపిక్ తీస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. తన తర్వాతి మూవీపై గురించి ట్వీట్టర్ ద్వారా తెలిపారు వర్మ.

తాను మరో బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నానంటూ వర్మ సంచలన ప్రకటన చేశారు. అది ఎవరిదో కాదు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బయోపిక్. దయలేని పురుషులకు వ్యతిరేకంగా అల్లుకున్న ఓ బంధం కథ. జైళ్లు, మన్నార్‌గుడి గ్యాంగ్స్’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ పొస్టర్ ను కూడా విడుదల చేశారు వర్మ. ఈసినిమాపై ఎన్ని వివాదలు తలెత్తుతాయో చూడాలి మరి.