‘మజ్ను’ ఫిక్సయ్యాడు

438
Tollywood Natural Star Upcoming Film Majnu
Tollywood Natural Star Upcoming Film Majnu

న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేసిన నాని మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, జూన్లో జెంటిల్మన్గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో మజ్ను సినిమా చేస్తున్న నాని, ఈ సినిమాను సెప్టెంబర్ 17న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

విరించి వర్మతో నాని చేసిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జెమిని కిరణ్ నిర్మిస్తున్న మజ్ను చిత్రంలో అను ఇమాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. స్టైల్ కామెడీతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ లిరికల్ వీడియో విడుదల చేశారు. అంతేకాదు తన అఫీషియల్ పేజ్ ద్వారా ఆగస్ట్ 26న మజ్ఞు మూవీ ఆడియో వేడుక జరుగనున్నట్టు తెలిపాడు నాని.