భార్య శవాన్ని మోసిన భర్త కష్టం తీరింది..

313
Bank of Bahrain and Kuwait cheque
Bank of Bahrain and Kuwait cheque
- Advertisement -

అనారోగ్యంతో మృతిచెందిన తన భార్య కన్నుమూస్తే అంబులెన్స్‌ సదుపాయం అందుబాటులో లేకపోవడం, వేరే వాహనంలో తరలించేందుకు డబ్బులు లేకపోవడంతో తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాడు ధన మాఝీ. గత నెల ఒడిశాలోని కలహండి జిల్లాలో జరిగిన ఈ ఘటన యావత్‌ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతదేహం తీసుకువెళ్లేందుకు అతను పడిన కష్టం పత్రికల్లోను, సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది.. ఈ ఘటన పలువురిని కదిలిం చింది..ఆ నాటి ఘటన గురించి మీడియా ద్వారా తెలుసుకున్న బహ్రెయిన్‌ రాజు ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా అతడికి అండగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.

Odisha-bb

తాజాగా మాఝీకి బహ్రెయిన్‌ రాజు నుంచి ఆర్థిక సాయం అందింది. ఈ మేరకు ఖలీఫా పంపిన రూ. 8.87లక్షల చెక్కును దిల్లీలోని బహ్రెయిన్‌ ఎంబసీ ద్వారా ధనకు అందజేశారు. సామాజిక కార్యకర్త, కేఐఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు అచ్యుత సమంత సహకారంతో దిల్లీ వెళ్లి ధన తన చెక్కును తీసుకున్నాడు. ఈ డబ్బును బ్యాంకులో వేసి తన ముగ్గురు కుమార్తెల చదువుకు ఉపయోగిస్తానని మాఝీ చెప్పాడు.

manji

దేశవ్యాప్తంగా ధన మాఝికి పెద్ద ఎత్తున్న సాయం అందుతోంది. ఆయన ముగ్గురు కుమార్తెలకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత విద్యనందిస్తుందని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. సులభ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ 5 ఏళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షలతో ఫిక్స్‌డ్‌ డిపాజిటు ఖాతా తెరిచింది. కాల పరిమితి పూర్తి అయ్యే నాటికి ఈ మొత్తం రూ. 7.34 లక్షలు అవుతుంది. దానా మాఝి పెద్ద కుమార్తె చాందిని మాఝికి ఉద్యోగం ఇవ్వడం లేదా వివాహమయ్యే వరకు ప్రతి నెలా రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని సులభ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ప్రకటించింది. మహారాష్ట్రకు చెందిన స్వచ్చంధ సంస్థ రూ. 80 వేల ఆర్థిక సహాయం అందజేస్తు దానా మాఝితో ఆయన ముగ్గురు కుమార్తెల పేర్ల మీద రూ. 10 వేల చొప్పున వేర్వేరుగా 4 చెకుల్ని ప్రదానం చేసింది. గుజరాత్‌ నుంచి ఇద్దరు వ్యాపారులు రూ. 2 లక్షల చెక్కుల్ని పంపారు. అమెరికాలో ఉంటున్న ఒడియా వ్యక్తి జితేంద్ర మిశ్రా రూ. 1.05 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. రూ. 20 వేల ఆరంభ ఖాతాతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దానా మాఝి పేరు మీద పొదుపు ఖాతా తెరిచింది.

 

 

odisha-man-with-carrying-wife-body

- Advertisement -