భారీగా పెరిగిన పెట్రో ధరలు

168

వాహనదారులకు భారీ షాక్. కొంతకాలంగా తగ్గుతు వస్తున్న పెట్రోల్,డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై రూ 3.38 పైసలు పెరగగా,డీజిల్‌ పై రూ.2.6 పెరిగింది. ప్రతి 15 రోజుల కోసారి నిర్వహించే సమీక్షలో భాగంగా చమురు సంస్థలు పెట్రో రేట్లను పెంచుతు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. వరుసగా నాలుగు సార్లు తగ్గిన పెట్రోల్ ధరలతో వినియోగ దారులకు కొంతమేరకు ఉపశమనం లభించగా…తాజాగా పెంచిన ధరలతో వినియోగదారులపై భారం పడనుంది.