బలూచిస్థాన్‌లో మోడీకి జేజేలు..

153

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పాకిస్థాన్ కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని పాక్ పార్లమెంట్ తీర్మానం చేయడం, బుర్హన్ వానీ ఎన్ కౌంటర్ తరువాత కాశ్మీర్ అల్లకల్లోలం కావడం, పాక్ విచ్చలవిడిగా భారత్ పై దుష్ప్రచారాలు చేస్తూండడం, పాక్ లో ఉగ్రవాద దాడులు పెచ్చరిల్లడంతో మోడీ తన స్వరాన్ని పెంచారు.

బలూచిస్థాన్‌లో పాక్‌ పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు మోడీ. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్ గిత్ లో జరుగుతున్న ప్రజా ఉద్యమాలను ప్రస్తావించారు. వాటిని పాకిస్థాన్ ఎలా అణిచేస్తోందో వివరించారు. కాశ్మీర్‌ విషయంలో ఒక విధంగా, బలూబలూబలూచిస్థాన్‌కు వచ్చేసరికి మరో విధంగా పాకి మాట్లాడుతోందని ఆరోపించారు.

CqniGOvWAAAbTP_

ఈ నేపథ్యంలో మోడీ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో కలకలం రేపుతున్నాయి. బలూచిస్థాన్‌లో పాకిస్థాన్‌ మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రధాని మోడీ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించడాన్ని బెలూచ్‌ నేతలు ఆహ్వానించారు.మోడీకి కృతజ్ఞతలు చెబుతున్న బలూచిస్తాన్ నాయకులు.. తమకు స్వాతంత్ర్యం వచ్చేలా పాక్‌ను ఒప్పించాలని అమెరికా, యూరప్‌లను కోరుతున్నారు. మతపరమైన ఉగ్రవాదాన్ని ఒక విధానపర సాధనంగా పాక్‌ వినియోగించడం దీర్ఘకాలం పాటు ప్రభావం చూపిస్తుందని, ఉగ్రవాదాన్ని నిర్మూలించలేకపోయినా సమర్థంగా దానిని ఎదుర్కోవాలని బలూచ్‌ జాతీయ ఉద్యమం అధ్యక్షుడు ఖలీల్‌ బలూచ్‌ మంగళవారం వాషింగ్టన్‌లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

CqnnUQFWcAAVfOs  Cqnkc8kW8AEaltN

మానవత్వంపై చేస్తున్న నేరాలకు గానూ పాకిస్థాన్‌ను జవాబుదారీ చేయడంలో మోడీకి ఇతర దేశాలు మద్దతివ్వాలని కోరారు. గత 68 ఏళ్లుగా బలూచిస్థాన్‌ను ఆక్రమించుకున్న పాకిస్థాన్ అయిదు యుద్ధాల్లో అనేక నేరాలకు పాల్పడిందని ఆరోపించారు. జాతినే తుడిచి పెట్టేయడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను అంతర్జాతీయ సమాజం ఖండించాలని కోరారు. కాశ్మీర్‌లో పాక్‌ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర పాత్ర, ముంబై, పఠాన్‌కోట్‌ ఉగ్రవాద దాడుల్లో ప్రమేయం అందరికీ తెలిసిన సత్యాలేనన్నారు. కాశ్మీర్‌ విషయంలో ఒక విధంగా, బెలూచిస్థాన్‌కు వచ్చేసరికి మరో విధంగా పాక్ మాట్లాడుతోందని ఆయన ఆరోపించారు.

CqnohZVW8AAGDH5 CqnmLItXYAEpI2B