బాలయ్య పాట లీకైంది..

155
shatakarni

balaiah

నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై రూపొందుతున్న ప్రెస్టిజియస్‌ మూవీ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో షరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే తలంపుతో చిత్ర యూనిట్ పని చేస్తోంది. ఇక ఈ సినిమా బాలయ్య.. శ్రేయ ఫస్ట్‌లుక్స్‌ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రం టైటిల్ సాంగ్ ఇప్పుడు ఆన్ లైన్లో ప్రత్యక్షమై హల్ చల్ చేస్తోంది.

“విద్రాజిత సంభ్రవాముఖా జన తేజం… సంప్రోక్షిత పాలాక్ష ప్రమోద ప్రసారం… నిజముద్రా వివితోహయ వాహనవాహం… శకయవ్వన పల్లవదీక్షిత దుర్భేద్యం… దిగ్దికాంత కీర్తిక రజనీ… శాతకర్ణీ… శాతకర్ణీ… గౌతమీ పుత్ర శాతకర్ణీ” అంటూ సాగుతుందీ పాట. శాతకర్ణి అశ్వమేధయాగం చేస్తున్న వేళ, తన తల్లి పేరు అయిన గౌతమిని తన పేరు ముందు చేర్చుకునే సందర్భంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ ఎలా లీక్ అయిందన్న విషయం తెలియక నిర్మాతలు, యూనిట్ తలపట్టుకుంటుండగా, సాంగ్ సూపరన్న టాక్ వినిపిస్తోంది. పూర్తి క్వాలిటీతో కూడిన ఈ పాటను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సినిమాకు చిరంతన్‌ భట్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.