బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తాం

269
- Advertisement -

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత బంగారు బతుకమ్మ పోస్టర్, పాటల పుస్తకం, సీడీని ఆవిష్కరించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, గాయకుడు, కవి దేశపతి శ్రీనివాస్ సమక్షంలో ఎంపీ కవిత బతుకమ్మ పోస్టర్‌, పాటల పుస్తకాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ ‘ప్రతీ నియోజకవర్గం, ప్రతీ మండలం, ప్రతీ గ్రామంలో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. గతంలో బతుకమ్మ ఆడాలంటే మనకే మొహమాటం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరూ ధైర్యంగా బతుకమ్మను ఆడుతున్నారని, తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ ఎందుకని చాలా మంది అన్నారని, ఇప్పుడే బతుకమ్మ చాలా అవసరం ఉందని ఎంపీ కవిత అన్నారు. తెలంగాణ సంస్కృతి రాబోయే తరాలకు తెలియాలంటే బతుకమ్మను ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహించుకోవాలి. బతుకమ్మను ఆడటం ద్వారా తమ సంస్కృతిని కాపాడుకున్న వాళ్లమవుతాం.

jagruthi

మన సంస్కృతికి మనమే సైనికులం. మాతృభాషలో మాట్లాడితేనే మనకెక్కుతది. తెలంగాణ భాష, సంస్కృతి బతుకమ్మ పాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. టీమ్ స్పిరిట్‌కు బతుకమ్మ చక్కని ఉదాహరణ. కులాలకు, మతాలకు అతీతంగా తెలంగాణ సమాజాన్ని ఒక్కటిగా ఉంచేందుకు బతుకమ్మ పండుగ వేదిక అవుతుంది. బతుకమ్మ పాటల్లోని అందాన్ని, పదాల అర్థాలను పిల్లలకు తెలియజెప్పాలి. అమిత్ షా మితంగా మాట్లాడితే మంచిది. తెలంగాణకు న్యాయంగా వచ్చే వాటా కాకుండా.. ఏం ఇచ్చారో రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకత్వాలు చెప్పాలి అని ఆమె డిమాండ్ చేశారు.

kavitha

- Advertisement -