ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా `శ్రీరామరక్ష’

408
Sree Ramaraksha First Look Released
Sree Ramaraksha First Look Released

వశిష్ఠ సినీ అకాడమీ బ్యానర్‌పై రజిత్‌, షామిలి, నిషా, విజయ్‌కుమార్‌, షఫీ, జ్యోతి, శంకరాభరణం రాజ్యలక్ష్మి, కాశీ విశ్వనాథ్‌ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘శ్రీరామరక్ష’. రాము దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రభాత్‌ వర్మ నిర్మిస్తున్నారు.

ఒక సాంగ్‌ మినహా సినిమా టాకీ మొత్తం పూర్తయ్యింది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సామాజిక బాధ్యతను తెలియజేసే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నాం. త్వరలోనే ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసి సెప్టెంబర్ లో సినిమా ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు.

ఈ చిత్రానికి మాటలు, సాహిత్యం: పరిమి కేథార్‌నాథ్‌, మ్యూజిక్‌: సాబు వర్గీస్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: వైధి, సినిమాటోగ్రఫీ: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి, ఫైట్స్‌: రామ్‌ సుంకర, సహ నిర్మాతలు: గమిడి సత్యం, పి.వి.రంగరాజు, నిర్మాత: ప్రభాత్ వర్మ, స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాము.