ఫైబ‌ర్‌తో ఇంటింటికి ఇంట‌ర్నెట్

626
- Advertisement -

ఇంటి ఇంటికి ఫైబ‌ర్ కనెక్ష‌న్ ద్వారా ఇంట‌ర్నెట్ సౌక‌ర్యాలు క‌ల్పించ‌నున్న‌ట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైటెక్ సిటీలోని హైటెక్స్ లో కేబుల్ నెట్ ఎక్స్‌పోను ఇవాళ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ.. ఇంటి ఇంటికి న‌ల్లా క‌నెక్ష‌న్ ఇచ్చిన‌ట్టుగానే ఇంటి ఇంటికి ఫైబ‌ర్ కనెక్ష‌న్ కూడా ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని మంత్రి అన్నారు. ఫైబ‌ర్ ద్వారా కేవ‌లం ఇంట‌ర్నెట్ సౌక‌ర్యాలు క‌ల్పించ‌నున్న‌ట్లు, కేబుల్ ప్ర‌సారాలు ఇవ్వ‌బోమ‌ని ఈ సంధర్బంగా స్పష్టం చేశారు. .పోల్ ట్యాక్స్ నుంచి కేబుల్ ఆప‌రేటర్ల‌కు మిన‌హాయింపు క‌ల్పించ‌నున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా కేబుల్ ఆప‌రేట‌ర్ల‌కు, ఎంఎస్‌వోల‌కు ఎలాంటి ఇబ్బందులు రానివ్వ‌బోమ‌ని కేటీఆర్ అన్నారు.

మూడు రోజుల పాటు నిర్వహించే ఈ స్టాళ్లను ఉభ‌య రాష్ట్రాల‌కు చెందిన కేబుల్ ఆప‌రేట‌ర్లు ప్ర‌ద‌ర్శ‌న‌లో ఏర్పాటు చేశారు. ఎక్స్ పోను ప్రారంభించిన తర్వాత కేటీఆర్ అన్ని స్టాళ్ల వద్దకు వెళ్లి ఆపరేటర్లతో కాసేపు ముచ్చటించారు.

- Advertisement -