ప్రభుత్వ ప్రోత్సాహం భేష్‌

529

క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం మంచి ప్రోత్సాహం అందిస్తోందని కోచ్ గోపించంద్ తెలిపారు. సింధు టీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఫోన్ కాల్‌లో మాట్లాడిన ఆయన సింధు గ్రేట్ స్టూడెంట్‌ అని కొనియాడారు.ప్రతి సంవత్సరం తన ఆటతీరును మెరుగుపర్చుకుంటూ…మంచి ఫలితాలను సాధించిందని తెలిపారు.

గొల్కోండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో క్రీడాకారులకు సీఎం మంచి ప్రోత్సాహం అందించారని తెలిపారు.ప్లేయర్స్ తో పాటు కోచ్‌లను బాగా ఎంకరేజ్ చేశారని తెలిపారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంత్రి కేటీఆర్‌ చక్కని సహకారం అందించారని కితాబిచ్చారు. సీఎం కేసీఆర్‌ని కలిసిన సందర్భంగా తమ అభిప్రాయాలను ఆయనతో షేర్ చేసుకున్నామని…ఆయన చాలా బాగా స్పందించారని తెలిపారు. తెలంగాణలో క్రీడారంగానికి మంచి భవిష్యత్ ఉందని తెలిపారు.

కోచ్ గోపిచంద్‌ వల్లే ఒలింపిక్స్‌లో పతకం సాధించానని పీవీ సింధు తెలిపింది.కోచ్‌ గోపిచంద్ లేకుంటే తాను ఈ స్టేజ్‌లో ఉండేదాన్ని కాదని…గోపిచంద్ నా రోల్ మాడల్‌ అని తెలిపింది.