ప్రపంచ యాత్రకు బామ్మ.. మోడలింగ్‌లో తాత

169

ముసలివాళ్లు వయసు మీద పడడంతో తమ పనులు తాము చేసుకోలేరు. ఇక భారత్‌లో అయితే 50 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ తీసుకొని కృష్ణా.. రామా.. అంటూ తీర్థయాత్రలకు వెళ్లాలని అనుకుంటారు. కానీ చైనాలో అలా కాదు. 80 ఏళ్లు దాటిన ఇద్దరు ముసలి వాళ్లు తాము ఇంక రిటైర్ కాలేదని స్పష్టం చేస్తున్నారు. చైనాకు చెందిన ఓ వృద్ధురాలు లియు 101ఏళ్ల వయస్సులో ప్రపంచాన్ని చుట్టేయడానికి సిద్దమవుతుంటే.. ఓ ఎనభైయేళ్ల కుర్రాడు మోడలింగ్‌లో అదరగొడుతున్నాడు.

30brk70aa

చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్‌కి చెందిన లియు.. ఓ నిరుపేద కుటుంబంలో జన్మించింది. కుటుంబం కోసం తన జీవితమంతా కష్టపడింది. తన కోరికలన్నీ పక్కన పెట్టింది. ఇక చిన్నప్పటి నుండి తనకున్న కోరికల్లా చైనా మొత్తం చుట్టేయడం. ఇటీవల లియు ఒంటిరిగానే చైనా అంతా చుట్టేసింది.ఇప్పుడు ఆమె వయసు 101ఏళ్లు. ప్రస్తుతం ఆమె కుటుంబం కూడా బాగా స్థిరపడింది. తాజాగా లియు కుటుంబ సభ్యులు ఆమెకు మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. పర్యటనలపై ఉన్న మక్కువను చూసి ఆమె కుటుంబ సభ్యులు లియుకు ప్రపంచ పర్యటన చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం తాజాగా ఈ సెంచరీ కొట్టిన బామ్మ పాస్‌పోర్టు పొందింది. త్వరలో జపాన్‌ నుంచి.. కొరియా మీదుగా ప్రపంచ పర్యటనకు బయలుదేరుతుందట.

30brk86aa

కాగా, మరో కేసులో ఓ ఎనభైయేళ్ల కుర్రాడు మోడలింగ్‌లో అదరగొడుతున్నాడు. చైనాకు చెందిన దేషాన్‌ వాంగ్‌కు 80 ఏళ్లు. అయితేనేం.. కుర్రాళ్లతో పోటీ పడతాడు. సినిమాల్లో నటించినా రానీ గుర్తింపు.. ఆయనకు ఇపుడు మోడలింగ్‌ ద్వారా వచ్చింది. వాంగ్‌ ఇప్పుడు ఒక మోడల్‌. అంతేకాదు. స్కేటింగ్‌ చేస్తాడు. ఆటలు ఆడుతాడు. జిమ్‌లో వర్కవట్స్‌ చేస్తాడు. అందుకే 80లో దృఢమైన దేహదారుఢ్యంతో ఉన్నాడు. నిజానికి వాంగ్‌ తన 49 ఏట నుంచి జిమ్‌.. 50లో స్విమ్మింగ్‌ చేయడం ప్రారంభించాడు. అంటే అతని జీవితం 50లోనే ప్రారంభమైందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే కుర్రాళ్లకి దీటుగా క్రీడలు, జిమ్‌, వర్కవుట్‌లు వంటివి చేయడం మొదలు పెట్టాడో అప్పటినుంచే వాంగ్‌కి మోడలింగ్‌లో అవకాశాలు పెరిగాయి. జనాల్లో గుర్తింపు సైతం బాగానే వచ్చింది. ప్రస్తుతం ఫ్యాషన్‌ షోల్లో వాంగ్‌ క్యాట్‌ వ్యాక్‌ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.

5ddde3bf-4839-4379-80e9-8d7e4dfa1661

మోడల్‌గా ఉన్న తన మనవరాలు సైతం వాంగ్‌ని చూసి చాలా గర్వపడుతుంది. ఇప్పుడు వాంగ్‌ చైనాలోని చాలా మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆరాటం, తపన, సాధించాలనే కోరిక ఉంటే మనిషికి వయోభారం అడ్డం కాదని వాంగ్‌ రుజువు చేశాడని అక్కడి ప్రజలు వాంగ్‌ని పొగుడుతున్నారు.