పోలీసులు నన్ను ఏమీ చేయలేరు

649
- Advertisement -

గ్యాంగ్‌స్టర్‌ నయీం అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన ఓ వ్యాపారిని నయీం బెదిరించిన ఆడియో ఇప్పుడు మీడియాకు చిక్కింది. కోటి రూపాయలు ఇవ్వకపోతే కుటుంబసభ్యులను చంపేస్తానని వ్యాపారిని నయీం బెదిరించాడు.

కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా భువ‌న‌గిరికి చెందిన వ్యాపారి నాగేంద్ర‌ బెదిరించాడు నయీమ్‌. డ‌బ్బులు అరేంజ్ చేసేందుకు నెల రోజులు స‌మ‌యం ఇవ్వాల్సిందిగా నాగేంద‌ర్ ప్రాధేయ‌ప‌డ్డాడు. ఇందుకు న‌యీమ్ స‌మ‌యం ఇచ్చేందుకు స‌సేమిరా అన్నాడు. ప‌దిహేను రోజుల్లో స‌గం అమౌంట్‌, మిగ‌తా అమౌంట్ మ‌రో ప‌దిహేను రోజుల్లో సెటిల్ చేయాల‌ని చెప్పాడు న‌యీమ్‌. డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ రికార్డు చేసి కేసు పెట్టినా త‌న‌కు భ‌యం లేద‌ని.. పోలీసులు త‌న‌ను ఏమీ చేయ‌లేర‌ని చెప్పాడు. అంతేకాదు నాగేంద్ర త‌న‌ను చంపేందుకు ప్లాన్ చేసిన‌ట్లు త‌న‌కు తెలుసున‌ని ఫోన్ సంభాష‌ణ‌ల సంధ‌ర్భంగా న‌యీమ్ నాగేంద్ర‌తో చెప్పాడు. కోటి రూపాయలు ఇవ్వ‌కుంటే ఎవ‌రు ఎవ‌రిని చంపుతారో తేల్చుకుందామ‌ని బెదిరించాడు. డ‌బ్బులు భువ‌న‌గిరిలో కాకుండా హైద‌రాబాద్‌లో ముట్ట‌జెప్పాల‌ని న‌యీమ్ డిమాండ్ చేశాడు .

‘నీకు ఇచ్చిన సమయం పూర్తయింది. ఇప్పుడు నువ్వు డబ్బు ఇచ్చినా నేను తీసుకోను. దీనికి శిక్ష నువ్వు అనుభవిస్తావు’ అని నయీం.. వ్యాపారిని బెదిరించాడు. తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రిలో ఉన్నానని.. డబ్బు సమకూర్చేందుకు నెల రోజుల సమయం కావాలని వ్యాపారి కోరగా.. ‘నెల రోజుల సమయం నువ్వు డబ్బు ఇచ్చేందుకు అడుగుతున్నావా? నన్ను ఎలా చంపాలి అని ప్లాన్‌ చేసేందుకా? అని నయీం ఆగ్రహం వ్యక్తం చేశాడు.

డ‌బ్బులు భువ‌న‌గిరిలో కాకుండా హైద‌రాబాద్‌లో ముట్ట‌జెప్పాల‌ని న‌యీమ్ డిమాండ్ చేశాడు .మాట త‌ప్పితే ఇక ప్రాణాలు గాల్లో క‌లుస్తాయ‌ని బెదిరించాడు న‌యీమ్‌. డ‌బ్బు స‌మ‌కూర్చుకుని త‌న కుర్రాళ్ల‌కు ఫోన్ చేసి ఆ సొమ్మును అప్ప‌జెప్పాల్సిందిగా న‌యీమ్ నాగేంద‌ర్‌కు వార్నింగ్ ఇచ్చాడు. చివరకు నెలరోజుల్లో ఎలాగైనా డబ్బు ఏర్పాటు చేస్తానని వ్యాపారి నచ్చజెప్పడంతో నయీం ఫోన్‌ పెట్టేశాడు.

- Advertisement -