పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కే తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డిల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలను ఈ సమావేశంలో మంత్రులు చర్చించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున నూతనంగా నీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో అనేక అవకాశాలు ఏర్పడతాయి మంత్రులు తెలిపారు.వ్యవసాయం రంగం, పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ లతో కలిసి పరిశ్రమల శాఖ పని చేయడం ద్వారా మరిన్ని వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టవచ్చన్న మంత్రులు అన్నారు.
ఈ మేరకు గ్రామీణ అభివృద్ధి, పశుసంవర్ధక శాఖ, పరిశ్రమల శాఖ సమన్వయంతో కలిసి ముందుకు పోవాలని నిర్ణయించారు.ఈ మూడు శాఖలు సమన్వయంతో కలిసి పనిచేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు మంత్రులు. పశుసంవర్ధక శాఖకి ముఖ్యమంత్రి ప్రోత్సాహం ఉన్న నేపథ్యంలో మరిన్ని కార్యక్రమాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు మంత్రి కేటీఆర్. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ విజన్ వలన ఇప్పటికే యానిమల్ హస్బండ్రీ శాఖ చేపట్టిన గొర్రెల పంపిణీ మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్ చేపట్టిన అనేక కార్యక్రమాలు విజయవంతం అయ్యాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.