పవన్ ‘కాటమరాయుడు’

370

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ సినిమా అంటే అభిమానులకు పండగే. సినిమా హిట్…ప్లాప్‌లతో సంబంధం లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. సినిమా ప్రారంభమైన దగ్గరి నుంచి విడుదలయ్యే వరకు ఆయన సినిమాకు సంబంధించిన ప్రతీ అంశం ఉత్సుకతను కలిగిస్తుంది. త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తికాలం రాజకీయాల్లోకి అడుగుపెడతానని పవన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

జల్సా, పులి, పంజా, గబ్బర్‌సింగ్‌, సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఇలా ఆయన సినిమా టైటిళ్లు కూడా మాస్‌ను మెప్పించేలా ఉంటాయి. ఇప్పుడు తాజాగా ‘కాటమరాయుడు’గా పవన్‌కల్యాణ్‌ రాబోతున్నారు. వీరం సినిమా అనుగుణంగా యాక్షన్ సినిమాతో పవన్ కల్యాణ్ ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. ఈ సినిమాకు తొలత దర్శకుడు ఎస్.జే. సూర్య ఫిక్స్ అయినా అతడు బిజీ కావడంతో గోపాలగోపాల డైరక్టర్ డాలికి ఈ అవకాశం ఇచ్చాడు పవన్ కల్యాణ్. ఈ సినిమా తమిళ చిత్రం వీరంకు రీమేక్ అనే వార్తలు వచ్చాయి. కానీ పవన్ ఫ్యాక్షనిజం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించాలని సూచించినట్లు తెలుస్తోంది.

sharath marar

శుక్రవారం పవన్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్‌కు సంబంధించి నిర్మాత శరత్‌మరార్‌ ఓ ప్రకటన చేశారు. ‘కాటమరాయుడు’ పేరుతో పవన్‌ సినిమాను నిర్మించనున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. ‘గోపాల గోపాల’ దర్శకుడు కిశోర్‌కుమార్‌ పార్దసాని(డాలీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించారు.