పవన్‌ ప్రసంగాలపై నిహారిక కామెంట్స్‌ ..!

740
Niharika Konidela
- Advertisement -

మెగా ప్రిన్సెస్ అనే బలమైన ఐడెండిటీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక. మెగా ఫ్యామిలీ నుంచి కెమెరా ముందుకొచ్చిన తొలి అమ్మాయిగా కొణిదెల నిహారికకు మొదట్లో మంచి క్రేజే వచ్చింది.. కానీ ఆమె నటించిన సినిమాలు ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘సూర్యకాంతం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది నిహారిక. ఈ చిత్రం శనివారం థియేటర్లకు వచ్చింది.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించింది. “పవన్ బాబాయ్ ఎక్కువగా మాట్లాడడు. .. ఆయన మితభాషి. ఎప్పుడు చూసినా కామ్‌గా కనిపించే ఆయన, ఏదైనా ఫంక్షన్ కి వస్తే మాత్రం బాగానే సందడి చేస్తాడు. అంతేకాదు మేము ఏదైనా పిచ్చి పనులు చేస్తే ఆటపట్టిస్తాడు.. ఏడిపిస్తాడు. అలాంటి ఆయన జనంలో వేదికలపై నుంచి చేసే ప్రసంగాలు వింటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ప్రసంగాలు నాకు స్ఫూర్తినిస్తాయి ..

అయితే ఈ విషయం ఇంతవరకూ బాబాయ్ కి చెప్పలేదు. ఆయనకి అసలు స్వార్థమంటే ఏమిటో తెలియదు. ఇక తాను ఓ పెద్ద స్టార్ ను అనే గర్వాన్ని కూడా ఆయనలో నేను ఎప్పుడూ చూడలేదు” నాకు తెలిసి రాజకీయాల్లో అంతటి స్వచ్ఛమైన వ్యక్తి మరొకరు వుండరు. అని చెప్పుకొచ్చింది.

- Advertisement -