నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారా..జర భద్రం!

24
- Advertisement -

నేటి రోజుల్లో ప్రతిదీ డిజిటల్ అయిపోయింది. ముఖ్యంగా నగదు చెల్లింపు విషయంలో ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ బ్యాంకింగ్ కు అలవాటు పడ్డారు. గతంలో మాదిరి బ్యాంకు కు వెళ్ళి గంటల తరబడి క్యూలో నిలబడి నగదు తీసుకోవడం లేదా నగదు బదిలీ చేసే రోజులకు కాలం చెల్లింది. ప్రస్తుత రోజుల్లో ఉన్నచోటు నుంచే నగదు లావాదేవీలు జరుపుతున్నారు. అంతే కాకుండా ఆన్ లైన్ ద్వారానే డబ్బు చెల్లించి కావాల్సిన వస్తువులను కొనుకుంటున్నారు. అయితే ఆన్ లైన్ లో నగదు చెల్లింపు వల్ల మంది సైబర్ మోసల బారిన పడుతున్నారు. అమాయకులను టార్గెట్ చేసుకొని హ్యాకర్స్ బ్యాంకుల్లో డబ్బును మాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ బ్యాంకింగ్ ఎక్కువగా చేసే వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు సూచనలు పాటించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు. .

* బ్యాంకింగ్ యాప్స్ కు బలమైన పాస్వర్డ్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. సులభమైన పాస్వర్డ్ పెట్టుకోవడం వల్ల హ్యాకర్స్ సులువుగా హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి నెట్ బ్యాంకింగ్ చేసే వారు నెలకొక్కసారి పాస్వర్డ్ మార్చుతూ ఉండాలి.

* అత్యవసర సమయాల్లో బయటి కంప్యూటర్స్ ద్వారా నెట్ బ్యాంకింగ్ చేయాల్సి వచ్చినప్పుడు… లావాదేవీలు పూర్తయిన తర్వాత వెంటనే లాగ్ అవుట్ చేసి పాస్వర్డ్ తప్పనిసరిగా చేంజ్ చేయాలి.

* ఫోన్ లో తెలియని మెసేజ్ లకు రీప్లే ఇవ్వకూడదు. అలాగే బయటి లింక్స్ ను ఓపెన్ చేయకూడదు. వాటి ద్వారా పోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. త ద్వారా నగదు లావాదేవీలు జరిగే సమయంలో బ్యాంకింగ్ సమాచారం హ్యాకర్స్ చేతికి చిక్కే అవకాశం ఉంది.

* నెట్ బ్యాంకింగ్ చేసే టైమ్ లో వెబ్ సైట్ సురక్షితమైనదా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ వెబ్ సైట్ లలో ఏమాత్రం బ్యాంకింగ్ సమాచారం ఇవ్వకూడదు.

Also Read:ఈటలను బీజేపీ నుంచి గెంటేస్తున్నారా?

- Advertisement -