నిన్ను నువ్వు ప్రేమించుకో..

284
mahesh koratala
- Advertisement -

మహేష్ బాబు,కొరటాల కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే. మహేష్ బాబు గ్రాఫ్ పడిపోతున్న టైంలో కొరటాల శ్రీమంతుడు వంటి ఒక రేంజ్ హిట్ ఇచ్చి మహేష్ బాబుకి ఫుల్ బూస్టప్ ఇచ్చాడు. దాంతో కొరటాలతో మరోసారి కలిసి పని చేసేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు మహేష్‌. మురుగదాస్ తో మహేష్ బాబు సినిమా అయిన వెంటనే కొరటాలతో చేయబోవు సినిమా పట్టాలెక్కనుంది.

mahesh business man

కొరటాల శివ.. తన మొదటి సినిమా ‘మిర్చి’ లో పక్కవాళ్ళని ప్రేమిద్దాం.. పోయేదేముంది తిరిగి ప్రేమిస్తారంతే అన్నాడు. రెండవ సినిమా ‘శ్రీమంతుడు’ లో బ్రతుకునిచ్చిన ఊరి ఋణం తీర్చుకోవాలని సొసైటీలో పెద్ద స్థాయిలో ఉన్నవారంతా గ్రామాలను దత్తత తీసుకునేలా చేశాడు. ఇక మూడవ చిత్రం ‘జనతా గ్యారేజ్’ లో పర్యావరణాన్ని ప్రేమించండి.. పక్క వాడి కష్టంలో తోడుండండి అన్నాడు. అలాగే తాను మహేష్ బాబుతో చేయబోయే సినిమా సబ్జెక్ట్ కూడా చాలా పెద్దదని, అందులోనూ సోషల్ ఎలిమెంట్ ఉందని, ఖచ్చితంగా బాగుంటుందని అన్నాడే కానీ అదేమిటో చెప్పలేదు. అయితే అది ‘లవ్ యువర్ సెల్ఫ్ – నిన్ను నువ్వు ప్రేమించుకో’ అనే అంశమని సినీ వర్గాల్లో టాక్. ప్రస్తుత కాలంలో యాంత్రిక జీవనానికి అలవాటుపడి కనీసం తమ గురించి తామే ఆలోచించుకోని జనాలకి లైఫ్ ని ఎలా గడపాలో చెప్పే విధంగా ఈ కథ ఉంటుందట.

Tamanna Latest Hot Navel Show Stills In Half Pink Saree (1)

ఇక ఈ సినిమాకు హీరోయిన్ తమన్నాను ఎంచుకున్నట్టు సమాచారం. మహేష్ బాబుతో కలిసి గతంలో ‘ఆగడు’ చిత్రంలో నటించింది తమన్నా. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరోసారి తమన్నా, మహేష్‌తో జత కట్టడానికి సిద్ధపడుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే మహేష్ తనకు శ్రీమంతుడు వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మించనున్నారు.

- Advertisement -