నయీంపై సినిమా తీస్తా..

449

వివాదాస్పద ప్రకటనలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా సంచలనాత్మక ప్రకటన చేశారు. తెలుగులో వంగవీటి చివరి సినిమా అని ప్రకటించిన వర్మ….మరోసారి తన మనసు మార్చుకున్నాడు. తెలంగాణ గ్రేహండ్స్ పోలీసుల చేతిలో హతమైపోయిన గ్యాంగ్ స్టర్ నయీమ్ పై తాను ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆయన ఇవాళ ఉదయం ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నయీమ్ జీవిత చరిత్ర ఆధారంగా తాను ఓ చిత్రాన్ని తీయనున్నట్లు వెల్లడించిన ఆయన… సదరు చిత్రాన్ని మూడు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

‘‘వివిధ వర్గాల నుంచి నయీమ్ కు సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించాను.నయీమ్ స్టోరీ చాలా సంక్లిష్టంగా ఉంది. దీనిని సింగిల్ సినిమాలో చెప్పడం కష్టం. అందుకే నయీమ్ స్టోరీని మూడు భాగాలుగా చిత్రీకరించాలని నిర్ణయించా అంటూ ట్విట్ చేశాడు.

naeem