నట్టికుమార్‌ ఓ పిచ్చికుక్క

193
Natti charged that Kalyan had links with Nayeem and this created ripples in the Telugu film industry.
Natti charged that Kalyan had links with Nayeem and this created ripples in the Telugu film industry.

గ్యాంగ్‌స్టర్ నయీంతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు చేసిన నిర్మాత నట్టి కుమార్‌పై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. నట్టికుమార్‌ ఓ పిచ్చికుక్క అని, అతని చరిత్ర అంతా బ్లాక్‌మెయిలింగేనని అన్నారు.

సినీ పరిశ్రమకు చెందిన నలుగురు నిర్మాతలకు నయీంతో సంబంధాలున్నాయన్న నట్టి కుమార్ వ్యాఖ్యల నేపథ్యంలో సీ కళ్యాణ్ శుక్రవారం ఉదయం మీడియా మందుకు వచ్చారు. నట్టి కుమార్ ప్రజలను, ప్రభుత్వాలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఏసుక్రీస్తు పేరు చెప్పుకొని డబ్బులు దండుకుంటున్నాడన్నారు. నట్టి బాధితులు చాలామంది ఉన్నారని, అతని బాధితుల కోసం ఓ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. నట్టిది బ్లాక్ మెయిలింగ్ చరిత్ర అన్నారు. అతనిని వెంటనే అదుపులోకి తీసుకొని.. అతని వద్ద నయీంతో సంబంధాలున్న ఆధారాలను తీసుకోవాలన్నారు. నట్టి కుమార్‌తో పాటు ఆయన కుటుంబసభ్యుల పైనా సి కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నయీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు నిజమని తేలితే సినిమా పరిశ్రమలో ఎంతటి పెద్దవాడైనా అదుపులోకి తీసుకుని ప్రశ్నించి, శిక్షించవచ్చని తెలుగు సినీ పరిశ్రమ తరపున చెబుతున్నామన్నారు.hqdefault

బ్లూఫిలిమ్స్ తీసి, నగ్నంగా ఉన్న అమ్మాయిల ఫోటోలు తీసుకొని కూడా బ్లాక్ మెయిల్ చేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీలి చిత్రాలు తీస్తూ, లీజుకు తీసుకున్న థియేటర్లను తనవని చెప్పుకుని బ్యాంకుల ఓడీ లావాదేవీలు నడిపించిన నట్టి కుమార్‌కు తనను విమర్శించే స్థాయి లేదన్నారు. తన సినిమాల్లో నటించే హీరోయిన్ల నగ్న చిత్రాలను తీసి వారినే బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర నట్టికుమార్‌ది అని సీ కళ్యాణ్ మండిపడ్డారు.

తనతో పాటు పలువురు నిర్మాతలు, సినీ రంగానికి చెందిన ప్రముఖులను నట్టి కుమార్ నిలువునా మోసం చేశాడని, వైజాగ్ నుంచి తరిమేస్తే హైదరాబాద్ వచ్చి తలదాచుకున్నాడని విమర్శించారు. నట్టి కుమార్ మాదిరే అతడి కొడుకు కూడా తనను మోసగించాడని సీ కల్యాణ్ ధ్వజమెత్తారు. తన కొడుకు ప్రాజెక్టు రిపోర్టు కోసమని అడిగితే తన సినిమా.. ఎటో వెళ్లిపోయింది మనసు కాపీ ఇస్తే, దానిని నెట్లో పెట్టి, ఆపై కేసులకు భయపడి తన కాళ్లు పట్టుకున్నాడని అన్నారు. విశాఖలో బ్యాంకులలో ఓవర్ డ్రాఫ్టుల పేరుతో ఓ కుంభకోణం జరిగిందని, అది త్వరలోనే బయటకు రానుందని అన్నారు. సినిమా పరిశ్రమ పైన ప్రేమతో వచ్చిన ఓ వ్యక్తిని మోసగించాడన్నారు. నయీం కేసులో నట్టి కుమార్ వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టాలని కోరారు. నట్టి కుమార్ జీవితమే బ్లాక్ మెయిల్ అన్నారు.